Amigos: ఆ పాట చూశాక అందరూ షాక్ అవుతారు: కల్యాణ్ రామ్
కల్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోగా తెరకెక్కిన సినిమా ‘అమిగోస్’ (Amigos). ఆయన త్రిపాత్రాభినయం చేసిన ఈ చిత్రం ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆ సినిమాకు సంబంధించిన విశేషాలు కల్యాణ్ రామ్ మీడియాతో పంచుకున్నారు.
రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో కల్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోగా తెరకెక్కిన సినిమా ‘అమిగోస్’ (Amigos). ఆషికా రంగనాథ్ కథానాయిక. కల్యాణ్‌రామ్ త్రిపాత్రాభినయం చేస్తుండటంతో ప్రచార చిత్రం నుంచే ఆసక్తి కలిగించిన ఈ సినిమా ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘అమిగోస్’ (Amigos)కు సంబంధించిన విశేషాలు కల్యాణ్ రామ్ మీడియాతో పంచుకున్నారు.
‘బింబిసార’ (Bimbisara) సక్సెస్‌ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు.
కల్యాణ్ రామ్: ‘బింబిసార’ సక్సెస్ జోష్‌తోనే ‘అమిగోస్’ (Amigos) తీశాను. ఏదైనా సినిమా హిట్ అయితే మనపై మనకు నమ్మకం పెరుగుతుంది. దానితోపాటు బాధ్యత కూడా రెట్టింపవుతుంది. కొత్తగా ప్రయత్నిద్దాం అని అనుకుంటాం. నేను ‘బింబిసార’, ‘అమిగోస్’, ‘డెవిల్’ ఈ మూడు కథలు 2020లోనే ఓకే చేశాను. అమిగోస్ కథ వినగానే కొత్తగా అనిపించింది. అందుకే వెంటనే ఓకే చేశాను. సాధారణంగా సినిమాలో ట్రిపుల్ రోల్ అంటే కనీసం ఇద్దరు హీరోయిన్‌లైనా ఉంటారు. కానీ ‘అమిగోస్’ పూర్తి విభిన్నమైన సినిమా. ఇందులో ఒక్క హీరోయిన్ మాత్రమే ఉంటుంది. విలన్ కూడా ఉండడు. ఒకే పోలికలతో ఉండే ముగ్గురు వ్యక్తులు ఎలా కలిశారు. వాళ్లకేం కావాలి.. ఇలా సినిమా అంతా ఆసక్తిగా ఉంటుంది.
‘అమిగోస్’ అనే టైటిల్‌నే ఎందుకు పెట్టారు?
కల్యాణ్ రామ్: ఈ సినిమాలో ముగ్గురి పాత్రలు కీలకమైనవే. అలాంటప్పుడు ఎవరో ఒకరి పేరు సినిమాకు పెట్టడం కరెక్ట్ కాదు. ఫ్రెండ్‌షిప్‌నకు సంబంధించిన టైటిల్ పెట్టాలని నిర్ణయించాం. అలా అని రోటీన్‌గా కాకుండా కొత్తగా ఉండాలనుకున్నాం. సోషల్‌మీడియాలో అమిగో అనే హ్యాష్‌ట్యాగ్ చూశాను. నచ్చింది. ఈ సినిమాకు కూడా సరిపోతుందనిపించింది. దాని అర్థం ఎవరికీ తెలియదు అని ఎందుకు అనుకోవాలి. ‘కాంతార’ సినిమా వచ్చేవరకు ఆ పేరు అర్థం ఎవరికీ తెలీదు కదా!
‘అమిగోస్’ ఎలాంటి సినిమా.. కమర్షియల్ సినిమానా లేక ప్రయోగాత్మకమైనదా?
కల్యాణ్ రామ్: నేను తీసిన సినిమాల్లో కమర్షియల్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. ‘బింబిసార’ కూడా పాత కథే. కానీ ఆ కథను చూపించే విధానంపై సినిమా ఆధారపడి ఉంటుంది. ‘అమిగోస్’ సినిమా 2 గంటల 19 నిమిషాలు ఉంటుంది. అందులో రెండు గంటల పదిహేడు నిమిషాలు కల్యాణ్‌రామ్‌నే చూస్తారు. అంత ప్రాధాన్యం ఉంటుంది. మా కుటుంబంలో నుంచే త్రిపాత్రాభినయం సినిమాలు ఎక్కువగా వచ్చాయని అనుకుంటున్నారు. కానీ గతంలో చాలా మంది హీరోలు ట్రిపుల్ రోల్ సినిమాలు చేశారు. మా కుటుంబంలో హీరోలకు ఇలాంటి కథలు రావడం మా అదృష్టం.
‘బింబిసార’ నుంచి మీ కథల ఎంపికలో మార్పు వచ్చిందా?
కల్యాణ్ రామ్: అసలు ఆ సినిమా తర్వాత నేను ఏ కథనూ ఓకే చెయ్యలేదు. ఇవన్నీ దానికి ముందు రెడీ చేసుకున్నవే. నేను ‘బింబిసార’ ముందు ఎలా ఉన్నానో తర్వాత కూడా అలానే ఉన్నాను. ఏ సినిమా అంగీకరించినా.. ఆ పాత్ర గతంలో ఏ హీరో చెయ్యనిదై ఉండాలనుకుంటా. ఈ ఒక్క విషయాన్ని మాత్రం కచ్చితంగా చూస్తాను. అమిగోస్‌లో విలన్‌లా నటించడం చాలా కొత్తగా అనిపించింది. కొవిడ్ టైంలో నన్ను నేను బాగా తెలుసుకున్నాను. నేను చేసిన కొన్ని సినిమాలు ఎందుకు ఫెయిల్ అయ్యాయి అని ఆలోచించాను. నేను చేసిన తప్పులు ఏంటి అని తెలుసుకున్నాను. అమిగోస్ మేకింగ్ ప్రాసెస్ కొంచెం కష్టంగా అనిపించింది.
బాలకృష్ణ సినిమాలోని పాటను రీమేక్ చెయ్యాలని ఎందుకు అనిపించింది?
కల్యాణ్ రామ్: ఈ సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని చాలా కొత్తగా తీశాం. సెకండ్ హాఫ్‌లో కథ ఆసక్తిగా సాగుతున్నప్పుడు పాట వస్తే ప్రేక్షకులు నిరాశపడతారు. అలా జరగకుండా ఉండాలంటే ఏదైనా కొత్తగా చెయ్యాలని అనుకున్నాం. అందుకే రీమేక్ సాంగ్ పెట్టాం. ఈ పాటను స్క్రీన్‌పై చూసినప్పుడు అందరూ షాక్ అవుతారు.
ఆషికా రంగనాథ్‌తో చేయడం ఎలా అనిపించింది. ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన మీ పాత్ర ఏది?
కల్యాణ్ రామ్: ఆషికాను హీరోయిన్‌గా టీం అంతా కలిసి ఓకే చేశాం. ఆమె మంచి డ్యాన్సర్. కన్నడ, తమిళంలో కొన్ని సినిమాలు చేసింది. ఈ సినిమాలో నేను చేసిన మంజునాథ్, సిద్ధార్థ్, మైఖేల్ మూడు పాత్రలు నాకు నచ్చాయి. సిద్ధార్థ్ చాలా యాక్టివ్‌గా ఉంటాడు. మంజునాథ్ చాలా సైలెంట్ అండ్ సాఫ్ట్. మైఖేల్ పాత్ర పూర్తిగా భిన్నమైంది. గ్యాంగ్‌స్టర్ లాంటి పాత్ర. ఈ సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
ఈ సినిమాను ఇతర భాషల్లో విడుదల చెయ్యాలని ఎందుకు అనిపించలేదు?
కల్యాణ్ రామ్: ఈ మాట మీరు మైత్రీ మూవీస్ వారిని అడగాలి(నవ్వుతూ). సినిమా చేస్తున్నంతసేపు పాత్రలు, సన్నివేశాల గురించే ఆలోచించాం. మార్కెటింగ్ విషయాల గురించి ఆలోచించలేదు. ఈ సినిమాకు సీక్వెల్ కూడా లేదు.
ఒకే పోలికలతో ఉండే మనుషులను మీరు ఎప్పుడైనా చూశారా?
కల్యాణ్ రామ్: మనుషులను పోలిన మనుషులు ఉంటారని ఇటీవల వార్తల్లో చూశాను. చాలా ఆనందంగా అనిపించింది. మేము చేస్తున్న కథ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉందనిపించింది. ‘జనతా గ్యారేజ్’ సినిమా అప్పుడు మైత్రీ మూవీస్ వారితో పరిచయం ఏర్పడింది. ఇప్పుడు మేమంతా ఓ కుటుంబంలా కలిసిపోయాం.
‘బింబిసార2’, ‘డెవిల్’ అప్‌డేట్స్ ఏమైనా చెబుతారా?
కల్యాణ్ రామ్: ‘డెవిల్’ సినిమా షూటింగ్ 70శాతం పూర్తయింది. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. మరో మూడు నెలల్లో కంప్లీట్ అవుతుందనుకుంటున్నాం. ‘బింబిసార2’ ఈ ఏడాది చివరలో షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
KTR vs Bandi sanjay: ఉగాది వేళ.. కేటీఆర్, బండి సంజయ్ పొలిటికల్ పంచాంగం చూశారా!
-
Movies News
Guna Sekhar: సమంతను అలా ఎంపిక చేశా.. ఆ విషయంలో పరిధి దాటలేదు: గుణ శేఖర్
-
Crime News
TSPSC: నిందితుల కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు.. 40మంది టీఎస్పీఎస్సీ సిబ్బందికి సిట్ నోటీసులు
-
World News
Rent a girl friend: అద్దెకు గర్ల్‌ఫ్రెండ్.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్...
-
India News
దేవుడా.. ఈ బిడ్డను సురక్షితంగా ఉంచు: భూప్రకంపనల మధ్యే సి-సెక్షన్ చేసిన వైద్యులు..!
-
Politics News
AP News: ఎవరి అంతరాత్మ ఎలా ప్రబోధిస్తుందో?.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి