Bimbisara: ‘ఆచార్య’ పాత విడుదల తేదీపై కన్నేసిన బింబిసార?

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘బింబిసార’. చారిత్రక నేపథ్యమున్న కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి వశిష్ట్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే, కరోనా నేపథ్యంలో పలు సినిమాల విడుదల

Published : 22 Jan 2022 01:44 IST

హైదరాబాద్‌: నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘బింబిసార’. చారిత్రక నేపథ్యమున్న కథాంశంతో రాబోతున్న ఈ చిత్రానికి వశిష్ట్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే, కరోనా నేపథ్యంలో పలు సినిమాల విడుదల తేదీల్లో మార్పులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా ఫిబ్రవరి 4న విడుదల కావాల్సి ఉండగా.. ఏప్రిల్‌ 1వ తేదీకి వాయిదా పడింది. దీంతో ఖాళీగా ఉన్న ఫిబ్రవరి 4వ తేదీన ‘బింబిసార’ చిత్రం ప్రేక్షకుల ముందుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చిత్రబృందం సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. 

కల్యాణ్ రామ్‌ సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో కల్యాణ్‌ రామ్‌ బింబిసార అనే క్రూరమైన రాజుగా కనిపించనున్నారు. ఆయనకు జోడీగా కేథరిన్‌, సంయుక్త మేనన్‌ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. మొదటి భాగం విడుదలైన తర్వాత రెండో భాగం చిత్రీకరణ ప్రారంభించనున్నారు. రెండో భాగంలో ఓ ప్రముఖ నటుడు ప్రతినాయకుడిగా కనిపిస్తారని, భారీ తారగణం ఉండబోతోందని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని