Cinema News: ‘కల్యాణం’ సాంగ్‌ వచ్చేసింది

యువ నటుడు ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘పుష్పక విమానం’. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో గీతా...

Updated : 18 Jun 2021 13:15 IST

హైదరాబాద్‌: యువ నటుడు ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘పుష్పక విమానం’. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో గీతా షైనీ కథానాయిక. దామోదర దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘కల్యాణం’ పాటను అగ్రకథానాయిక సమంత సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. ‘కల్యాణం కమనీయం ఒకటయ్యే వేళనా.. వైభోగం’ అంటూ సాగే ఈ పెళ్లి పాటను సిద్‌శ్రీరామ్‌ ఆలపించారు. ఈ చిత్రానికి రామ్‌ మిరియాల స్వరాలు అందించారు. విజయ్‌ దేవరకొండ సమర్పణలో కింగ్‌ ఆఫ్‌ ది హిల్‌, టాంగా ప్రొడెక్షన్స్‌ సంయుక్తంగా ‘పుష్పకవిమానం’ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని