Indian 2: ఆట ఆరంభమైంది

‘ఇది రెండో స్వాతంత్య్ర పోరాటం. గాంధీజీ మార్గంలో మీరు, నేతాజీ మార్గంలో నేనూ...’ అంటూ మరోసారి తనదైన శైలిలో ప్రక్షాళనకి నడుం బిగించారు సేనాపతి.

Updated : 26 Jun 2024 10:02 IST

ది రెండో స్వాతంత్య్ర పోరాటం. గాంధీజీ మార్గంలో మీరు, నేతాజీ మార్గంలో నేనూ...’ అంటూ మరోసారి తనదైన శైలిలో ప్రక్షాళనకి నడుం బిగించారు సేనాపతి. ఈ సారి ఆయన ఏమేం చేశారో తెలియాలంటే ‘భారతీయుడు 2’ చూడాల్సిందే. కమల్‌హాసన్‌ కథానాయకుడిగా... శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ‘భారతీయుడు’కి కొనసాగింపుగా రానుంది. సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్‌ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, ఎస్‌.జె.సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు. జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. మంగళవారం ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘ఊరేనా రా ఇది. చదువుకు తగ్గ జాబ్‌ లేదు. జాబ్‌కి తగ్గ జీతం లేదు. కట్టిన టాక్స్‌కి తగ్గట్టుగా ఫెసిలిటీస్‌ దొరకడం లేదు. దొంగిలించేవాడు దొంగిలిస్తూనే ఉంటాడు. తప్పు చేసేవాడు తప్పు చేస్తూనే ఉంటాడు....’ అంటూ మొదలవుతుంది ఈ ట్రైలర్‌.  ‘పారిపోలేరు, దాక్కోనూలేరు. టామ్‌ అండ్‌ జెర్రీ ఆట ఆరంభమైంది..’ అంటూ సేనాపతి పాత్రలో కమల్‌హాసన్‌ చేసే విన్యాసాలు, ఆయన గెటప్పులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. శంకర్‌ శైలి భారీతనం,  సాంకేతిక హంగులు  ట్రైలర్‌లో కనిపించాయి. ఈ చిత్రానికి అనిరుధ్‌ స్వరకర్త.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని