Kamal Haasan: మా ఇద్దరి మధ్య అసూయ లేదు: రజనీకాంత్‌తో స్నేహంపై కమల్‌ హాసన్‌ కామెంట్స్

రజనీకాంత్‌తో స్నేహం 20ఏళ్ల నుంచి కొనసాగుతోందని కమల్‌హాసన్‌ అన్నారు. వారి అనుబంధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published : 02 Jul 2024 12:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వారి అద్భుతమైన నటనతో ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు నటులు కమల్‌హాసన్‌, రజనీకాంత్ (Rajinikanth). కుర్ర హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. వీళ్లిద్దరూ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. తాజాగా తమ మధ్య అనుబంధాన్ని తెలియజేస్తూ కమల్‌ హాసన్‌ (Kamal Haasan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘మా స్నేహం ఎన్నోఏళ్లుగా కొనసాగుతోంది. మేమిద్దరం కలిసి గతంలో సినిమాల్లో కలిసి నటించాం. కలిసి సినిమాలు చేయకూడదని ఒక దశలో నిర్ణయించుకున్నాం. మా ఇద్దరికీ గురువు ఒక్కరే (దర్శకుడు కె.బాలచందర్‌). మా ఇద్దరి మధ్య పోటీతత్వం ఉంది కానీ, అసూయ లేదు. ఇద్దరం రెండు వేర్వేరు మార్గాల్లో ప్రయాణిస్తామంతే. అయినా, ఎప్పుడూ ఒకరి గురించి మరొకరం చులకన వ్యాఖ్యలు చేసుకోలేదు. ఇప్పుడు సీనియర్లం కాబట్టి ఇలా ఉంటున్నాం అనుకోవద్దు. 20 ఏళ్ల నుంచి మేం ఇలానే ఉంటున్నాం’ అని చెప్పారు.

‘ఆలస్యమైందా ఆచార్య పుత్రా’.. ఇవి కదా ప్రభాస్‌ కటౌట్‌కు అదిరిపోయే సీన్స్‌

ప్రస్తుతం కమల్‌హాసన్‌, రజనీకాంత్‌ ఇద్దరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో కమల్‌ హాసన్‌ నటించిన ‘భారతీయుడు 2’ విడుదలకు సిద్ధంగా ఉంది. జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితోపాటు మరో 2 సినిమాలు లైనప్‌లో ఉన్నాయి. రజనీకాంత్‌ ‘వేట్టయాన్‌’లో నటిస్తున్నారు. దీనితో పాటు అలాగే లోకేశ్ కనగరాజ్‌ దర్శకత్వంలో ‘కూలీ’ (Coolie Movie) చిత్రంలో నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని