Kamal haasan: తమిళానికి అడ్డొస్తే హిందీని వ్యతిరేకించక తప్పదు

హిందీని వ్యతిరేకించను. అలాగని నా మాతృభాష తమిళానికి అడ్డుపడితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని’ విశ్వనటుడు కమల్‌హాసన్‌ పేర్కొన్నారు. కమల్‌ స్వీయ నిర్మాణంలో హీరోగా నటించిన చిత్రం ‘విక్రమ్‌’. లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించారు.

Updated : 17 May 2022 12:05 IST

కమల్‌హాసన్‌

చెన్నై: ‘హిందీని వ్యతిరేకించను. అలాగని నా మాతృభాష తమిళానికి అడ్డుపడితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని’ విశ్వనటుడు కమల్‌హాసన్‌ పేర్కొన్నారు. కమల్‌ స్వీయ నిర్మాణంలో హీరోగా నటించిన చిత్రం ‘విక్రమ్‌’. లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించారు. అనిరుధ్‌ సంగీతం సమకూర్చారు. ఫహద్‌, విజయ్‌సేతుపతి తదితరులు నటించారు. జూన్‌ 3న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌, పాటల విడుదల కార్యక్రమం చెన్నైలో జరిగింది. కమల్‌, విజయసేతుపతి, అనిరుధ్‌, లోకేష్‌ కనకరాజ్‌, నరేన్‌, కాళిదాస్‌ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమంలో ఉదయనిధి, శింబు, పార్తిబన్‌, దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌లు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కమల్‌హాసన్‌ మాట్లాడుతూ.. ‘‘సినిమా, రాజకీయాలు.. కవలపిల్లలు. అదే నేను చేస్తున్నా. తమిళం వర్థిల్లాలి అని చెప్పడం నా బాధ్యత. దీనికి ఎవరు అడ్డువచ్చినా ఎదుర్కొంటా. దీనికి, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. మాతృభాషను మరవకండి. హిందీకి వ్యతిరేకినని చెప్పను. అలాగే, గుజరాతీ, చైనీస్‌ భాషలు కూడా మాట్లాడండి. చివరి సమయంలో నటుడు సూర్య మాకు సహకరించారు. ఆయనకు కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. ఈ చిత్రంలో సూర్య కూడా ఓ ముఖ్యమైన పాత్ర పోషించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని