Kamal Haasan: ‘నాయకుడు’లా శక్తిమంతంగా ‘కేహెచ్234’
దర్శకుడు మణిరత్నం, హీరో కమల్ హాసన్ కలయికలో రానున్న కొత్త చిత్రం ‘కేహెచ్234’(వర్కింగ్ టైటిల్).
దర్శకుడు మణిరత్నం, హీరో కమల్ హాసన్ (Kamal Haasan) కలయికలో రానున్న కొత్త చిత్రం ‘కేహెచ్234’(వర్కింగ్ టైటిల్). కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన చేసినా, ఈ చిత్ర విషయాలు తాజాగా వెల్లడించారు హీరో కమల్. ఈ సినిమాపై ఏర్పడుతున్న అంచనాలను చూస్తుంటే కాస్త కంగారుగానే ఉందంటున్నారు కమల్. మణిరత్నం దర్శకత్వంలో కమల్ హీరోగా వచ్చిన ‘నాయకుడు’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కొత్త చిత్రం కూడా అంతే శక్తిమంతంగా ఉంటుందని భావిస్తున్నానని చెప్పారు కమల్. రాబోయే రెండు మూడు నెలల్లో చిత్రీకరణ మొదలుకానుంది. సినిమాలోని ఇతర పాత్రల వివరాలను త్వరలో ప్రకటించనుంది చిత్రబృందం. కమల్ హాసన్‌కు జోడీగా త్రిష నటిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. ‘కేహెచ్234’ త్రిషకు కమల్‌హాసన్‌తో కలిసి చేసే మూడవ సినిమా అవుతుంది. ఇదివరకు వారిద్దరు కలిసి ‘తూంగవనం, మన్మధన్ అంబు’ సినిమాలలో నటించారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘భారతీయుడు 2’ షూటింగ్‌లో కమల్ హాసన్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రికరణ చివరిదశలో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Asian Games: షూటింగ్‌లో మరో గోల్డ్.. వుషూలో రజతం
-
మా స్నేహం మీద ఒట్టు.. చంద్రబాబు ఎలాంటి తప్పూ చేయరు: బాబు బాల్య స్నేహితులు
-
Vijayawada: సీఎం సభకు మీరు రాకుంటే.. మా ఉద్యోగాలు పోతాయ్
-
Rohit Sharma: సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం.. వరల్డ్‌కప్ జట్టుపై నో డౌట్స్: రోహిత్
-
Gautam Gambhir: తిరుమల శ్రీవారి సేవలో గౌతమ్ గంభీర్ దంపతులు