Kamal Haasan: కమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌’ ఆ ఓటీటీలోకే.. విడుదలకు ముందే రికార్డు

కమల్‌ హాసన్‌ హీరోగా నటించిన ‘విక్రమ్‌’ సినిమా విడుదలకు ముందే రికార్డు సృష్టించింది....

Published : 05 May 2022 01:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కమల్‌ హాసన్‌ హీరోగా నటించిన ‘విక్రమ్‌’ చిత్రం విడుదలకు ముందే రికార్డు సృష్టించింది. జూన్‌ 3న (థియేటర్లలో) ప్రేక్షకుల ముందుకురానున్న ఈ సినిమా శాటిలైట్‌, డిజిటల్‌ హక్కులు సుమారు రూ.125 కోట్లకు అమ్ముడయ్యాయి. ‘స్టార్‌’ గ్రూప్‌ శాటిలైట్‌ రైట్స్‌ సొంతం చేసుకోగా డిజిటల్‌ రైట్స్‌ను ‘డిస్నీ+ హాట్‌స్టార్’ చేజిక్కించుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్‌కానుంది. ‘ఖైదీ’ ఫేమ్‌ లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించాడు. ఈ సినిమాను కమల్‌హాసన్‌, ఆర్‌.మహేంద్రన్‌ సంయుక్తంగా నిర్మించారు. కమల్‌కు ఇది 232వ సినిమా. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, వీడియో గ్లింప్స్‌కు విశేష స్పందన వచ్చింది. మే 15న ట్రైలర్‌ విడుదలకానుంది. మే 18న ‘కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో ట్రైలర్‌ ప్రదర్శితమవుతుందని చిత్ర బృందం తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని