Published : 31 Oct 2020 14:28 IST

కమల్‌హాసన్‌ సర్‌ప్రైజ్‌ ఇస్తారా?

చెన్నై: లోకనాయకుడు కమల్‌హాసన్‌ నుంచి సినీప్రియులకు ఓ అపురూప కానుక అందబోతుంది. నవంబరు 7న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ‘కమల్‌ 232’వ చిత్రం నుంచి ఓ చిన్న టీజర్‌ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. విలక్షణ  దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌  తెరకెక్కించనున్న చిత్రమిది. కమల్‌ స్వీయ నిర్మాణంలో రూపొందనుంది. త్వరలోనే రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభమవుతుంది.

ఈ నేపథ్యంలోనే కమల్‌పై ఇటీవల టెస్ట్‌ షూట్‌ చేసినట్లు సమాచారం. ఇప్పుడు దీనికి సంబంధించిన విజువల్స్‌తోనే చిన్న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు   తెలుస్తోంది. ఈ చిత్రంతో కమల్‌ను మునుపెన్నడూ చూడని విధంగా చాలా కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారట లోకేష్‌. ఇప్పటికే స్క్రిప్ట్, పూర్వ నిర్మాణ పనులు పూర్తయ్యాయి.

నవంబరు నెలాఖరు లేదా డిసెంబరు నుంచి సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారని, రెండు నెలల్లోనే చిత్రీకరణ పూర్తి చేయనున్నారని తెలుస్తోంది.  ప్రస్తుతం కమల్‌ చేస్తున్న ‘భారతీయుడు 2’ షూటింగ్‌ త్వరలో పునఃప్రారంభం కానుంది. దీనికి శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts