Indian 2: భారతీయుడు కోసం అంతర్జాతీయ యాక్షన్‌ కొరియోగ్రాఫర్లు

‘విక్రమ్‌’ (Vikram) విజయం తర్వాత మరింత జోరుగా సినిమాల్ని పూర్తి చేస్తున్నారు కమల్‌హాసన్‌ (Kamal Haasan). ప్రస్తుతం ఆయన దృష్టంతా ‘భారతీయుడు 2’ (Indian 2)పైనే ఉంది.

Updated : 10 Mar 2023 08:30 IST

‘విక్రమ్‌’ (Vikram) విజయం తర్వాత మరింత జోరుగా సినిమాల్ని పూర్తి చేస్తున్నారు కమల్‌హాసన్‌ (Kamal Haasan). ప్రస్తుతం ఆయన దృష్టంతా ‘భారతీయుడు 2’ (Indian 2)పైనే ఉంది. ప్రముఖ దర్శకుడు శంకర్‌ ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసే ఉన్నారు. పలు కారణాలతో ఇప్పటికే ఆలస్యమైన ఈ సినిమాని ఎలాంటి అవాంతరాలు లేకుండా త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు. కొన్ని రోజులుగా ఈ సినిమా చిత్రీకరణ చెన్నైలో జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలోని కీలక యాక్షన్‌ ఘటాల్ని తెరకెక్కిస్తున్నారట. దీని కోసం అంతర్జాతీయ స్థాయి యాక్షన్‌ కొరియోగ్రాఫర్లు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది. ఎక్కువ రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో ఇటీవలే కాజల్‌ కూడా పాల్గొంది. ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్‌సింగ్‌ కూడా నటిస్తోంది. సముద్రఖని, బాబీ సింహా, ప్రియ భవానీ శంకర్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలు అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని