Prabhas: ప్రభాస్ ‘ప్రాజెక్ట్ -కె’లో మరో స్టార్ హీరో.. వైరలవుతోన్న న్యూస్
ప్రభాస్ నటిస్తోన్న ‘ప్రాజెక్ట్ - కె’ (Project K) సినిమాలో మరో అగ్ర నటుడు జాయిన్ అయినట్లు సమాచారం. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
హైదరాబాద్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘ప్రాజెక్ట్ - కె’ (Project K). భారీ తారాగణంతో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఇందులో అమితాబ్ బచ్చన్ లాంటి అగ్ర నటులు నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరలవుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌లో మరో స్టార్ హీరో కూడా భాగం కానున్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) ‘ప్రాజెక్ట్ - కె’లో కీలక పాత్రలో కనిపించనున్నారట. ఈ సినిమాలో కమల్ పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండనుందని టాక్ వినిపిస్తోంది. ఈ అగ్ర నటుడు విలన్ పాత్రలో కనిపించి షాక్ ఇవ్వనున్నారని కొందరు నెటిజన్లు అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు కానీ.. విషయం మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ప్రభాస్ సరసన దీపికా పదుకొణె నటించిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మునుపెన్నడు చూడని భారీ దృశ్యరూప చిత్రంగా, అతిపెద్ద యాక్షన్ థ్రిల్లర్‌గా ‘ప్రాజెక్ట్ కె’ ను తెరకెక్కించే పనిలో దర్శక నిర్మాతలు ఉన్నారట. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ (Adhipurush) కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని రెండో పాటను విడుదల చేయగా అది మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో పాటు ప్రభాస్ ‘సలార్’లోనూ నటిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Viral video : సింగపూర్‌లో 100 కేజీల బాంబు పేల్చివేత.. రెండో ప్రపంచ యుద్ధం నాటిది కావడంతో..!
-
PM Modi: గత 30 రోజుల్లో.. 85 మంది ప్రపంచ నేతలను కలిశా: మోదీ
-
Chandrababu Arrest: ఏం నేరం చేశారని చంద్రబాబును జైల్లో పెట్టారు: మురళీ మోహన్
-
భారత్ రాకెట్లలో 95 శాతం విడిభాగాలు స్వదేశీవే: ఇస్రో ఛైర్మన్
-
Exam Results: యూపీఎస్సీ ఎన్డీఏ, ఎన్ఏ-II పరీక్ష ఫలితాలు విడుదల
-
Afghanistan Currency : తాలిబన్ల రాజ్యంలో నగదు చలామణి పెరిగింది.. బ్లూమ్‌బర్గ్ తాజా నివేదిక!