Vikram: కమల్‌హాసన్‌ ‘విక్రమ్‌’ భారీ ధరకు ఓటీటీ+శాటిలైట్‌ రైట్స్‌?

కొన్ని సినిమాలు ప్రకటించినప్పుడే ఆసక్తిగా అనిపిస్తాయి. అలాంటి సినిమానే కమల్‌హాసన్‌(Kamal Haasan) ‘విక్రమ్‌’(Vikram).

Published : 31 May 2022 15:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొన్ని సినిమాలు ప్రకటించినప్పుడే ఆసక్తిగా అనిపిస్తాయి. అలాంటి సినిమానే కమల్‌హాసన్‌(Kamal Haasan) ‘విక్రమ్‌’(Vikram). విలక్షణ నటులుగా పేరుతెచ్చుకున్న విజయ్‌ సేతుపతి(Vijay Sethupathi), ఫహద్‌ ఫాజిల్‌(Fahadh Faasil) కూడా ఈ సినిమాలో నటిస్తుండటమే అందుకు కారణం. లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్‌ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ముగ్గురు స్టార్‌ నటులు నటిస్తుండటంతో ఈ సినిమాకు భారీగా బిజినెస్‌ జరిగినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇక శనివారం నుంచి టికెట్‌ బుక్సింగ్‌ ప్రారంభం కాగా, అక్కడ కూడా భారీ స్పందన వస్తున్నట్లు సమాచారం. అడవి శేష్‌ ‘మేజర్‌’, అక్షయ్‌ ‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌’ వంటి చిత్రాలు విడుదలవుతున్నా, ‘విక్రమ్‌’కు బుక్సింగ్స్‌ కూడా ఏమాత్రం తగ్గడం లేదట.

ఈ క్రమంలో మరో ఆసక్తికర వార్త కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్ర ఓటీటీ, శాటిలైట్‌ రైట్స్‌ కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయని టాక్‌. దాదాపు రూ.200 కోట్లకు డీల్‌ ముగిసిందట. ట్రేడ్‌ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా బడ్జెట్ రూ.110 కోట్లు. అంటే కేవలం ఓటీటీ+శాటిలైట్‌ రైట్స్‌ ద్వారా అదనంగా రూ.90కోట్లు వచ్చేశాయన్నమాట. మేకర్స్‌కు ఇది నిజంగా అదనపు బోనస్‌.  డిస్నీ+హాట్‌ స్టార్‌ ఓటీటీ రైట్స్‌ దక్కించుకున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కమల్‌హాసన్‌, ఆర్‌.మహేంద్రన్‌లు నిర్మిస్తున్నారు. తెలుగులో శ్రేష్ఠ్‌ మూవీస్‌ విడుదల చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని