Vikram: మరో ఓటీటీలోకి ‘విక్రమ్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే..?

కమల్‌ హాసన్‌కు ఈ ఏడాది ఘన విజయాన్ని అందించిన చిత్రం ‘విక్రమ్‌’. బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా జూన్‌లో ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో విడుదలైన సంగతి తెలిసిందే.

Published : 12 Sep 2022 21:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కమల్‌ హాసన్‌ (Kamal Haasan)కు ఈ ఏడాది ఘన విజయాన్ని అందించిన చిత్రం ‘విక్రమ్‌’ (Vikram). బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా జులైలో ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఓటీటీలోనూ సందడి చేసేందుకు సిద్ధమైంది. ‘జీ 5’ (Zee5)లో ఈ నెల 13 నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ సదరు సంస్థ గ్లింప్స్‌ పంచుకుంది. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రల్లో, సూర్య అతిథి పాత్రలో కనిపించి ప్రేక్షకులను విశేషంగా అలరించారు. మరోవైపు, ఈ సినిమా ‘ఆహా’ వేదికగా ఓవర్సీస్‌ ప్రేక్షకులను అలరిస్తోంది.

ఇదీ నేపథ్యం..

భారీగా మాదకద్రవ్యాలను పట్టుకున్న పోలీస్‌ అధికారి ప్రభంజన్‌, ఆయన తండ్రి కర్ణన్‌ (కమల్‌ హాసన్‌)ను ఓ ముఠా చంపేస్తుంది. ఈ డ్రగ్స్‌ దందాను నిలువరించి, హత్యలకు పాల్పడుతున్న ఆ ముఠాను పట్టుకునేందుకు అమర్‌ (ఫహద్‌ ఫాజిల్‌) అనే స్పై ఏజెంట్‌ రంగంలోకి దిగుతాడు. కేసు దర్యాప్తు చేస్తోన్న సమయంలో ఈ డ్రగ్స్‌ మాఫియా వెనుక సంతానం (విజయ్‌ సేతుపతి) హస్తం ఉన్నట్లు గుర్తిస్తాడు. కర్ణన్‌ బతికే ఉన్నట్లు తెలుసుకుంటాడు. అసలు కర్ణన్‌ ఎవరు? చనిపోయినట్లు ఎందుకు బయట ప్రపంచాన్ని నమ్మించాడు? అమర్‌ ఈ కేసును ఎలా ఛేదించాడు? రోలెక్స్‌ (సూర్య) పాత్ర ఏమిటి?.. అనే అంశాలన్నీ సినీ ప్రియులకు కొత్త అనుభూతి పంచాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని