Vikram: కమల్‌ అభిమానులకు చరణ్‌ సర్‌ప్రైజ్‌.. ‘విక్రమ్‌’ తెలుగు ట్రైలర్‌ అదరహో

కమల్‌హాసన్‌, సినీ అభిమానులకు రామ్‌చరణ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. కమల్‌హాసన్‌ నటించిన ‘విక్రమ్‌’ సినిమా తెలుగు ట్రైలర్‌ ఆయన సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు.

Published : 20 May 2022 17:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కమల్‌హాసన్‌ అభిమానులకు రామ్‌చరణ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ‘విక్రమ్‌’ సినిమా తెలుగు ట్రైలర్‌ను ఆయన సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే విడుదలైన తమిళం, హిందీ ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పుడా జాబితాలోకి ఈ ప్రచార చిత్రమూ చేరనుంది. కమల్‌ నటించిన గత చిత్రాలకు మించిన అంచనాలు ‘విక్రమ్‌’పై పెరుగుతున్నాయి. విజయ్‌సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు, సూర్య అతిథి పాత్ర పోషించడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు ‘ఖైదీ’, ‘మాస్టర్‌’ ఫేం లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌కు అనిరుధ్‌ స్వరాలందించారు. ఈ సినిమా జూన్‌ 3న విడుదలకానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని నటుడు నితిన్‌ సొంత బ్యానర్‌ శ్రేష్ఠ్‌ మూవీస్‌ రిలీజ్‌ చేయనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని