Kamal Haasan: మన స్నేహం దేవుడిచ్చిన వరం.. స్టార్‌ డైరెక్టర్‌కు విశ్వనటుడి శుభాకాంక్షలు

ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Kamal Haasan) పుట్టినరోజు సందర్భంగా కమల్‌ హాసన్‌ (Kamal Haasan)ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.

Published : 02 Jun 2023 18:35 IST

హైదరాబాద్‌: సినీ ఇండస్ట్రీలో ఉన్న అద్భుతమైన దర్శకుల్లో మణిరత్నం (ManiRatnam) ముందు వరుసలో ఉంటారు. అగ్ర నటీనటులు కూడా ఆయన దర్శకత్వంలో ఒక్కసారైనా నటించాలని కోరుకుంటారు. భాషతో సంబంధం లేకుండా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఆయనకు తెలుగు, తమిళ సినీ పరిశ్రమలోని స్టార్‌ హీరోలతో మంచి అనుబంధం ఉంది. ఇక విశ్వనటుడు కమల్‌ హాసన్‌, మణిరత్నం మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కమల్‌ హాసన్‌ (Kamal Haasan) ట్విటర్‌ వేదికగా హృదయపూర్వక నోట్ రాశారు. ఈ సందర్భంగా వాళ్ల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

‘‘ఈరోజు నాకెంతో ప్రత్యేకం. ఎందుకంటే నాకు అత్యంత ప్రియమైన స్నేహితుడు మణిరత్నం పుట్టినరోజు. ఆయన తనకున్న ప్రతిభతో కొన్ని లక్షల మంది హృదయాలను గెలుచుకున్నారు. తన సినిమాలోని మాటలు, డైలాగులు, విజువల్స్‌తో ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తారు. నిరంతరం నేర్చుకుంటూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని సినిమాకు ఉన్న భాషపరమైన హద్దుల్ని తొలగించారు. రానున్న తరం దర్శకులు ఎంతో మందికి మీరు ఆదర్శం. మీరు సాధించిన ఈ ప్రేమాభిమానాలు శాశ్వతంగా ఉంటాయి. ‘నాయకుడు’ సినిమా నుంచి రానున్న #KH234 వరకు సాగిన మన ప్రయాణం ఎంతో అపురూపం. కేవలం నటనపరంగానే కాదు వ్యక్తిగతంగానూ మన ప్రయాణం ఒక వరం. ఆ దేవుడిచ్చిన బహుమతిగా భావిస్తాను’’ అని పేర్కొన్నారు. ఇక మణిరత్నం పుట్టినరోజు సందర్భంగా తెలుగు, తమిళ పరిశ్రమలోని వారంతా సోషల్‌మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆయన సినిమాల్లోని సన్నివేశాలను షేర్‌ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని