Updated : 27 May 2022 08:15 IST

Kamal Hassan: మనమంతా ఒక్కటే

‘‘పాన్‌ ఇండియా చిత్రాలన్నవి ఇప్పుడు కొత్తగా వచ్చినవేమీ కాదు. ఇండస్ట్రీ ఆరంభం నుంచి ఉన్నాయి’’ అన్నారు కథానాయకుడు కమల్‌హాసన్‌. ఇప్పుడాయన నుంచి వస్తున్న యాక్షన్‌ చిత్రం ‘విక్రమ్‌’. లోకేష్‌ కనగరాజ్‌ తెరకెక్కించారు. విజయ్‌ సేతుపతి, ఫహాద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్‌ 3న  ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు కమల్‌. ఇందులో భాగంగా తాజాగా ఓ జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పాన్‌ ఇండియా సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘పాన్‌ ఇండియా అనే పదం ఓ కొత్త నాణెం లాంటిదే తప్ప మరొకటి కాదు. ఎందుకంటే పాన్‌ ఇండియా చిత్రాలు మన భారతీయ చిత్రసీమలో ఎల్లప్పుడూ ఉన్నాయి. ‘మొఘల్‌-ఎ-ఆజం’, ‘చెమ్మీన్‌’ వంటి క్లాసిక్‌ చిత్రాలు ఇందుకు మంచి ఉదాహరణ. శాంతారామ్‌, మొహమూద్‌ వంటి వారు ఎన్నో పాన్‌ ఇండియా సినిమాలు తీశారు. ‘చెమ్మీన్‌’ అనేది మలయాళ సినిమా. వాళ్లు దాన్ని ఇతర భాషల్లోకి డబ్‌  చేయలేదు. దానికి సబ్‌ టైటిల్స్‌ కూడా లేవు. కానీ, ప్రజలు దాన్ని భాషలు, ప్రాంతాలకు అతీతంగా ఆస్వాదించారు. సార్వత్రిక ఆకర్షణ, చిత్ర నిర్మాణ నాణ్యత.. ఇవే ఈ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ల విజయానికి మూల కారణాలు. మన దేశం అద్వితీయం. అమెరికాలా కాకుండా వివిధ భాషలు    మాట్లాడినా మనమంతా ఒక్కటే. అదే ఈ దేశానికి అందం’’ అని కమల్‌ వివరించారు. ఇక ‘విక్రమ్‌’ గురించి మాట్లాడుతూ.. ఇదొక బాధ్యతాయుతమైన చిత్రమన్నారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని