Kangana Ranaut: మీ ముందుకు ‘సీత’గా వస్తున్నా!

‘‘సీత: ది ఇంకార్నేషన్‌’’ చిత్రంలో సీత పాత్రలో ఎవరు నటించనున్నారనే సందేహం తొలిగిపోయింది. ఇటీవలే విడుదలైన ‘‘తలైవి’లో దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితగాథ పాత్రలో నటించి మెప్పించిన కంగనారనౌత్ తాజాగా తన తదుపరి చిత్రం గురించి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటించారు. 

Published : 15 Sep 2021 01:59 IST

ముంబయి: ‘‘సీత: ది ఇంకార్నేషన్‌’’ చిత్రంలో సీత పాత్రలో ఎవరు నటించనున్నారనే సందేహం తొలిగిపోయింది. ఇటీవలే విడుదలైన ‘‘తలైవి’లో దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితగాథ పాత్రలో నటించి మెప్పించిన కంగనారనౌత్ తాజాగా తన తదుపరి చిత్రం గురించి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటించారు. ‘‘సీత: ది ఇంకార్నేషన్‌’’ చిత్రంలో సీత పాత్రలో కనిపించబోతున్నాను అని తెలిపింది. ప్రముఖ సినీ రచయిత కెవీ విజయేంద్ర ప్రసాద్‌ కథ, స్క్రీన్‌ ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి, అలౌకిక్‌ దేశాయి దర్శకత్వం వహిస్తున్నారు. ఏ హ్యూమన్‌ బీయింగ్‌ స్టూడియో ప్రొడక్షన్స్ పతాకంపై ‘సీత’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మనోజ్‌ ముంతాషీర్‌ సాహిత్య, సంభాషణలు సమకూరుస్తున్నారు. 

అయితే గతంలో ఈ చిత్రంలో కరీనా కపూర్‌ నటించనుందని వార్తలు వచ్చాయి. అయితే తానే నటిస్తున్నట్లు కంగనా చెప్పడంతో సందేహాలు తొలగిపోయాయి. హిందీ, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సందర్భంగా ఇన్‌స్టాలో కంగనా పోస్టు చేశారు. ‘అత్యంత ప్రతిభావంతులైన ఆర్టిస్టుల బృందంతో కలిసి పనిచేయబోతున్నారు. సీతారాముల ఆశీర్వాదంతో మీ ముందుకు వస్తున్నా’ అంటూ కంగనా తెలిపారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని