అందుకే ఆమెను బి-గ్రేడ్‌ అనేది: కంగన

బాలీవుడ్‌ నటీమణులు కంగనా రనౌత్‌, తాప్సీ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉంది. మరోసారి వీరిద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. రైతుల నిరసన విషయమై ప్రస్తుతం వీరిద్దరి మధ్య ట్విటర్‌ వేదిక మాటల యుద్ధం జరుగుతోంది....

Updated : 05 Feb 2021 11:22 IST

సొట్టబుగ్గల సుందరిపై మరోసారి క్వీన్‌ ఫైర్‌

ముంబయి: బాలీవుడ్‌ నటీమణులు కంగనా రనౌత్‌, తాప్సీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. మరోసారి వీరిద్దరి మధ్య గొడవ తారస్థాయికి చేరుకుంది. రైతుల నిరసన విషయమై ప్రస్తుతం వీరిద్దరి మధ్య ట్విటర్‌ వేదికగా మాటల యుద్ధం జరుగుతోంది. భారత్‌లో రైతులు చేస్తోన్న నిరసనకు మద్దతు తెలుపుతూ ఇటీవల ప్రముఖ పాప్‌ గాయని రిహానా.. ‘రైతుల గురించి ఎవరూ మాట్లాడరేం’.. అంటూ ట్వీట్‌ చేశారు. దీనిపై స్పందించిన కంగన.. ‘మాట్లాడడానికి వారు రైతులైతే కాదు.. ఉగ్రవాదులు. పూర్తి అవగాహన లేకుండా మా దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు’ అని కామెంట్‌ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు పలువురు సెలబ్రిటీలు సైతం మా దేశ విషయాల్లో మీరు తలదూర్చవద్దు అంటూ నెట్టింట్లో పోస్టులు పెట్టారు.

కాగా.. నటి తాప్సీ తాజాగా ఓ ట్వీట్‌ చేశారు. ‘ఒక ట్వీట్ మీ ఐక్యతను దెబ్బతిస్తే.. ఓ జోక్ మీ విశ్వాసాన్ని కదిలిస్తే.. ఒక షో మీ మతాన్ని కించపరిస్తే.. అలాంటి సమయంలో ఐక్యతను బలోపేతం చేసేదిశగా మీ వ్యాఖ్యలు ఉండాలి కానీ, ప్రచార బోధకురాలిగా కాదు’ అని పేర్కొంటూ ట్వీట్‌ చేసింది. తాప్సీ పెట్టిన ట్వీట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన కంగన ఆమెను బి-గ్రేడ్‌ నటి అంటూ ఆరోపణలు చేశారు. ‘బి-గ్రేడ్‌ మనుషులకు బి-గ్రేడ్‌ ఆలోచనలే వస్తాయి. ఓ వ్యక్తి తన మాతృభూమి కోసం ముందుండి పోరాడడమే అసలైన ధర్మం. ఇలాంటి విషయాలు తెలియకుండా కొందరు ఉచిత సలహాలు ఇస్తారు. అందుకే వాళ్లని నేను బి-గ్రేడ్‌ అని పిలుస్తుంటాను. ఉచిత సలహాలిచ్చే ఇలాంటి వారి గురించి పట్టించుకోకపోవడం ఉత్తమం’ అని కంగన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి

భర్తతో విడిపోవడం బ్రేకప్‌లా ఉంది: శ్వేతాబసుప్రసాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని