Kangana Ranaut: ‘చంద్రముఖి’గా కంగనా రనౌత్.. ఈసారి హీరో రజనీకాంత్ కాదు!
మరోసారి తమిళ చిత్రంలో నటించే అవకాశంరావడంపై కంగనా రనౌత్ ఆనందం వ్యక్తం చేసింది. చంద్రముఖి పాత్రలో ఆమె కనిపించనుంది.
ఇంటర్నెట్ డెస్క్: హారర్ నేపథ్యంలో తెరకెక్కి, కొత్త ఒరవడి సృష్టించిన చిత్రం ‘చంద్రముఖి’ (Chandramukhi). ప్రముఖ నటుడు రజనీకాంత్ (Rajinikanth) హీరోగా 2005లో వచ్చిన ఈ సినిమా సీక్వెల్ ఇన్నేళ్లకు తెరకెక్కుతోంది. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన పి. వాసునే సీక్వెల్‌నూ డైరెక్ట్ చేస్తున్నారు. రాఘవ లారెన్స్ (Raghava Lawrence) హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రకటించడమే ఆలస్యం ‘కీలక పాత్ర అయిన ‘చంద్రముఖి’ని ఎవరు పోషిస్తారు?’ అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. దానికి సమాధానంగా కంగనా రనౌత్ (Kangana Ranaut) నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె ఈ విషయాన్ని మంగళవారం వెల్లడించింది. తమిళంలో రెండో సినిమా చేస్తుండడం, వాసు దర్శకత్వంలో నటించే అవకాశంరావడంపై సంతోషాన్ని వ్యక్తం చేసింది. డిసెంబరు తొలి వారంలో కంగనా షూటింగ్ పాల్గొనే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆమె ఇందిరా గాంధీగా ‘ఎమర్జెన్సీ’ అనే చిత్రంలో, ఎయిర్‌ఫోర్స్ పైలెట్‌గా ‘తేజస్’లో నటిస్తోంది.
తొలి భాగంలో చంద్రముఖిగా కనిపించి, విశేష ప్రేక్షకాదరణ పొందిన నటి జ్యోతిక. ఓ వైపు గంగ అనే పాత్రలో అమాయకంగా కనిపిస్తూ చంద్రముఖిగా భయపెట్టింది. పాత్రకు తగ్గట్టు చేసిన ఆమె చేసిన డ్యాన్స్ ప్రత్యేకంగా నిలిచింది. దాంతో, సీక్వెల్‌లోనూ జ్యోతికే నటిస్తుందని ఇటీవల కోలీవుడ్ వర్గాల్లో వినిపించింది. సుమారు రూ. 9 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దాదాపు 70 కోట్ల వసూళ్లు చేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Andhra News: మా భూమిని లాక్కుంటే ఆత్మహత్య చేసుకుంటా..సెల్ఫీ వీడియో తీసి యువరైతు అదృశ్యం
-
Ap-top-news News
Andhra News: భోగాపురం ఎయిర్పోర్ట్ వద్ద ఒబెరాయ్ సంస్థకు 40 ఎకరాలు!
-
Ap-top-news News
Vande Bharat Express: ‘వందే భారత్’ వచ్చినప్పుడే కాపలానా?
-
Ap-top-news News
రుషికొండపై వేంగి బ్లాక్ పూర్తికి టెండర్లు.. అక్కడే సీఎం క్యాంపు కార్యాలయం!
-
World News
US-China: 2025లో అమెరికా, చైనా మధ్య యుద్ధం?
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30/01/2023)