Kangana Ranuat: సల్మాన్‌ ఫోన్‌ చేస్తే పార్టీకి వెళ్లా: కంగన

టాపిక్‌ ఏదైనా సరే బాలీవుడ్‌ స్టార్స్‌పై తరచూ విమర్శలు చేస్తుంటారు నటి కంగనా రనౌత్‌. ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆమె, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని స్టార్‌ స్టేటస్‌ని సొంతం చేసుకున్నారు.....

Published : 19 May 2022 02:17 IST

ముంబయి: టాపిక్‌ ఏదైనా సరే బాలీవుడ్‌ స్టార్స్‌పై తరచూ విమర్శలు చేస్తుంటారు నటి కంగనా రనౌత్‌. నెపోటిజం అంటూ ఇప్పటికే ఎన్నోసార్లు బాలీవుడ్‌పై విరుచుకుపడిన ఆమె ఇటీవల సల్మాన్‌ఖాన్‌ ఇంట్లో జరిగిన పార్టీలో పాల్గొని అందర్నీ షాక్‌కు గురి చేశారు. బీటౌన్‌ వాళ్లపై హాట్‌ కామెంట్స్‌ చేస్తూ ఆ పార్టీలో ఎందుకు పాల్గొన్నారు? అని పలువురు విమర్శలు కూడా చేశారు. దీనిపై తాజాగా కంగన స్పందించారు.

‘‘బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఇచ్చే పార్టీల్లో పాల్గొనకూడదని నేనెమీ అనుకోలేదు. ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. ఇటీవల సల్మాన్‌ఖాన్‌ నివాసంలో జరిగిన రంజాన్‌ వేడుకల్లో పాల్గొన్నాను. పలువురు దానిపై కామెంట్లు చేస్తున్నారు. నిజం చెప్పాలంటే సల్మాన్‌ నాకు మంచి స్నేహితుడు. పార్టీకి రమ్మని ఫోన్‌ చేసి ఆహ్వానించారు. అందుకే వెళ్లా. అదీకాక ఇటీవల ఆయన నేను నటించిన సినిమాని సోషల్‌మీడియా వేదికగా ప్రమోట్‌ చేశారు. కొంతమంది తారలు ఉంటారు. తమ సినిమాలను మనతో ప్రమోట్‌ చేయించుకుంటారు. మనకు అవసరమైనప్పుడు మాత్రం సాయం చేయరు. ముఖ్యంగా అమిర్‌ఖాన్‌.. ‘మణికర్ణిక’ విడుదలైన సమయంలో నేను ఆయనకి ఫోన్‌ చేశా. ‘మీరు నటించిన ‘దంగల్‌’, ‘పీకే’ ట్రైలర్స్‌ని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసి.. ఆయా చిత్రాలు ప్రమోట్‌ చేయమని ఎన్నోసార్లు నన్ను అడిగారు కదా. ఇప్పుడు నా సినిమా విడుదలకు సిద్ధమైంది. కొంచెం మీరూ సాయం చేయండి’’ అని అడిగాను. కానీ ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదు’’ అని కంగన చెప్పుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని