Kangana Ranaut: కోలీవుడ్‌లో ప్రశంసలు.. బాలీవుడ్‌లో విమర్శలు: కంగనా ఏమన్నారంటే?
రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో పి. వాసు తెరకెక్కిస్తోన్న చిత్రం ‘చంద్రముఖి 2’. ఈ సినిమా చిత్రీకరణ విరామ సమయంలో కంగన ట్విటర్ వేదికగా తన ఫ్యాన్స్‌ను పలకరించారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రతిరోజూ ఏదో ఒక విషయంపై సోషల్ మీడియా వేదికగా కంగనా రనౌత్ (Kangana Ranaut) తన అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తుంటారు. సోమవారం తాను ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2) సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నప్పటికీ భోజన విరామ సమయంలో #askkangana అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఫ్యాన్స్‌తో ఆమె చిట్‌చాట్ నిర్వహించారు. ఆ ఆసక్తికర విశేషాలివీ...
* లారెన్స్‌తో కలిసి పనిచేయడం ఎలా అనిపిస్తోంది?
కంగనా: లారెన్స్ అద్భుతమైనవాడు. నా ప్రతిభను ప్రశంసించే అతణ్ని నేను ఇంకా కలవలేదు.
* ప్రభాస్‌తో మీకున్న అనుబంధం గురించి వివరిస్తారా?
కంగనా: ప్రభాస్ అంటే ముందుగా ఆతిథ్యమే గుర్తొస్తుంది. అతడి ఇంట్లోని భోజనం చాలా బాగుంటుంది. ప్రభాస్ మంచి హోస్ట్ కూడా.
* కార్తీక్ ఆర్యన్‌పై మీ అభిప్రాయం?
కంగనా: అతను చాలా కూల్. సెల్ఫ్‌మేడ్ యాక్టర్. తను ఎలాంటి బృందాల్లో కలవడు. తనదైన మార్గంలో ప్రయాణిస్తుంటాడు.
* హృతిక్ రోషన్, దిల్జీత్ దోసాంజ్.. వీరిద్దరిలో మీ అభిమాన నటుడెవరు?
కంగనా: ఒకరు యాక్షన్, మరొకరు వీడియో సాంగ్స్ చేస్తారని నేను అనుకుంటున్నా. నిజంగా చెబుతున్నా వారు నటించడం నేను చూడలేదు. వారి నటనను చూసినపుడే సమాధానం ఇవ్వగలను. అలాంటిది ఎప్పుడైనా జరిగితే నాకు తెలియజేయండి.
* ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియాలో మీ ‘టీకూ వెడ్స్ షేరు’ ఎప్పుడు విడుదలవుతుంది?
కంగనా: నేను ముంబయి చేరుకోగానే అమెజాన్ ప్రైమ్ సంస్థతో దానికి గురించి చర్చిస్తా. త్వరలోనే అది విడుదలకావొచ్చు.
* తమిళ సినిమాల్లో నటించడం ఎలా అనిపిస్తుంది? హిందీ, తమిళ చిత్రాలకు తేడా ఏం గమనించారు?
కంగనా: ‘చంద్రముఖి 2’.. తమిళంలో నేను నటిస్తున్న మూడో చిత్రం. నేను ప్రొఫెషనల్ నటినని, నా పని నేను చూసుకుంటానని, సైలెంట్‌గా ఉంటానని, ఎవరితోనూ పిచ్చాపాటీ మాట్లాడడని కోలీవుడ్ వారు అంటుంటారు. ఈ లక్షణాలకే నన్ను బాలీవుడ్ వారు అహంకారి అని పిలుస్తారు.
* భవిష్యత్తులో మీరు ఓ ప్రేమకథను రాసి, దానికి దర్శకత్వం వహించాలి. అది అద్భుతంగా ఉంటుందని విశ్వసిస్తున్నా.
కంగనా: తప్పకుండా. లవ్‌స్టోరీ తీయాలని నా ఎజెండాలో ఉంది.
* రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు?
కంగనా: దాని గురించి కచ్చితంగా చెప్పలేను. ప్రస్తుతానికి నటిగా ఇంకా చాలా చేయాలనుకుంటున్నా.
* కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గురించి ఎవరైనా మాట్లాడినప్పుడు మీకేం అనిపిస్తుంది?
కంగనా: సో.. సో.. స్వీట్
* మీరు యోగా చేస్తుంటారా?
కంగనా: టీనేజ్ నుంచి నేను యోగా, ధ్యానం చేస్తున్నా. మెడిటేషన్‌లో భాగమైన శూన్య, సంయమలాంటి వాటిని ఇషా ఫౌండేషన్ వారి సహకారంతో నేర్చుకుంటున్నా.
* మీ బలమేంటి? బలహీనత ఏంటి?
కంగనా: ధైర్యంగా ఉండడమే నా బలం. బలహీనతను నేను దగ్గరకు రానివ్వను. కానీ, నాలో నెగెటివ్ ఏదైనా ఉందంటే అది నా కోపం కావొచ్చు!
* మీ జీవితంలో మరిచిపోలేని సంఘటన?
కంగనా: నేను యుక్త వయసులోనే ఇంటికి దూరమయ్యా. ఆ సమయంలో ఏం చేయాలో తెలియని నాకు ఓ వ్యక్తి సమస్యలను ఎలా అధిగమించాలో చెప్పారు. శారీరకంగా, మానసికంగా నన్ను నేను మార్చుకున్నా. దేన్నైనా ఎదుర్కొనే శక్తిని అప్పుడే పొందా.
* నిజం, ప్రేమ.. ఈ రెండింటిలో దేనిని ఎంపిక చేసుకుంటారు?
కంగనా: నేను నిజాన్ని ఎంపిక చేసుకుంటా. ఎందుకంటే ప్రేమే మనల్ని ఎంపిక చేసుకుంటుంది తప్ప దాన్ని మనం ఎంపిక చేసుకోలేం.
* మీకు బాగా ఇష్టమైన రంగు?
కంగనా: తెలుపు, ఆకుపచ్చ
రజనీకాంత్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో గతంలో వచ్చిన సూపర్‌హిట్ చిత్రం ‘చంద్రముఖి’కి కొనసాగింపుగా ‘చంద్రముఖి 2’ తెరకెక్కుతోంది. పి. వాసు దర్శకుడు. ఈ సీక్వెల్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ హీరోగా, రాజనర్తకిగా కంగనా రనౌత్ నటిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Dhamki: ‘ధమ్కీ’కి బదులు ఆ సినిమా వేసిన థియేటర్ సిబ్బంది.. ప్రేక్షకులు షాక్
-
Politics News
Kishan Reddy: ఈ ఏడాది దేశానికి, తెలంగాణకు కీలకం: కిషన్‌రెడ్డి
-
Crime News
TSPSC: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్.. లావాదేవీలపై సిట్ ఆరా
-
Sports News
IND vs AUS : ‘రోహిత్-కోహ్లీ’ మరో రెండు పరుగులు చేస్తే.. ప్రపంచ రికార్డే
-
Politics News
KTR: మన దగ్గరా అలాగే సమాధానం ఇవ్వాలేమో?: కేటీఆర్
-
Movies News
Ugadi: ఉగాది జోష్ పెంచిన బాలయ్య.. కొత్త సినిమా పోస్టర్లతో టాలీవుడ్లో సందడి..