Updated : 12 May 2022 11:53 IST

Kangana Ranaut: అందుకే నాకు పెళ్లి కావడం లేదు: కంగన

ముంబయి: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ వివాహ వార్త కోసం ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆమె ఎవరితో ఏడు అడుగులు వేయనున్నారు? అనే అంశంపై ఆసక్తిగా ఉన్నారు. ఈ తరుణంలో తన పెళ్లిపై కంగన స్పందించారు. కొంతమంది వ్యాప్తి చేస్తోన్న పుకార్ల వల్లే తనకు పెళ్లి కావడం లేదని కంగన అన్నారు. ప్రస్తుతం ‘ధకడ్‌‌’ సినిమా ప్రమోషన్స్‌ పనుల్లో ఆమె బిజీగా ఉన్నారు. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కంగన ఏజెంట్‌ ‘అగ్ని’గా నటించారు. యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో సిద్ధమవుతోన్న ఈ సినిమా కోసం ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఓ బాలీవుడ్‌ ఛానెల్‌తో కంగన ముచ్చటించారు. ‘ధకడ్‌‌’ కథ తనకెంతగానో నచ్చిందన్నారు. తన రోల్‌ పవర్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పారు. దీంతో విలేకరి.. ‘‘ధకడ్‌‌’ చిత్రంలో మీరు పోషించిన రోల్‌ మీ నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందా?’’ అని ప్రశ్నించగా.. ‘‘అస్సలు కాదు.. నిజ జీవితంలో నేను ఎవర్ని కొడతాను? అబ్బాయిలపై నేను చేయి చేసుకుంటానంటూ పలువురు సృష్టిస్తోన్న పుకార్ల వల్లే నాకు పెళ్లి కావడం లేదు’’ అని కంగన నవ్వుతూ సమాధానమిచ్చారు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని