Bollywood films: ప్రస్తుతం ఆమె ఒంటి చేత్తో బాలీవుడ్‌ను కాపాడుతోంది..: కంగనా రనౌత్‌

బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ సీనియర్‌ హీరోయిన్‌ టబు పై ప్రశంసల వర్షం కురిపించింది. ప్రస్తుతం హిందీ చిత్ర పరిశ్రమను ఆమె కాపాడుతోందని పొగిడింది.

Updated : 22 Nov 2022 13:33 IST

హైదరాబాద్‌: బాలీవుడ్‌ జనాలు ఫైర్‌ బ్రాండ్‌గా పిలుచుకునే హీరోయిన్‌ కంగనారనౌత్‌ (Kangana Ranaut). ఎలాంటి విషయాల గురించైనా తనదైన శైలిలో స్పందిస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా మరోసారి బాలీవుడ్ సినిమాలపై కొన్ని వ్యాఖ్యలు చేసింది. సీనియర్‌ హీరోయిన్‌ టబు(Tabu) పై ప్రశంసల వర్షం కురిపించింది. ప్రస్తుతం బాలీవుడ్‌ చిత్రాలను టబు బతికిస్తోందని తెలిపింది.

‘‘ఈ ఏడాది రెండు హిందీ సినిమాలు మాత్రమే మంచి ప్రేక్షకాదరణ పొందాయి. అవి భూల్‌ భూలయ్యా2 (Bhool-Bhulaiyaa 2), దృశ్యం2 (Drishyam 2). ఈ రెండు చిత్రాల్లో సూపర్‌ స్టార్‌ టబు ప్రధాన పాత్రలో నటించారు. ఆమె 50 ఏళ్ల వయసులో ఒంటి చేత్తో హిందీ చిత్ర పరిశ్రమను కాపాడుతోంది. తన అద్భుతమైన ప్రతిభతో వయసుతో సంబంధం లేకుండా స్టార్‌గా నిలవడం నిజంగా అభినందనీయం. మహిళలు వాళ్లు చేసే పనిపై విశ్వాసంతో ఉంటారు. అలాంటి వారు ఇంకా ఎక్కువ ప్రశంసలు పొందడానికి అర్హులు. టబు ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతోంది’’ అని కంగనా తన ఇన్‌స్టా స్టోరీలో పొగడ్తలు కురింపించింది.

ప్రస్తుతం కంగనా లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలతో బిజీగా ఉంది. ‘ఎమర్జెన్సీ’ చిత్రంలో నటిస్తోంది. ఇందిరా గాంధీ హయాంలో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో ఆమె ‘ఇందిరా గాంధీ’ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని