Kangana Ranaut: ఎలాన్ మస్క్ ట్వీట్.. సినిమా మాఫియా తనని జైలుకు పంపాలనుకుందంటూ కంగన కామెంట్
తన ప్రేమ వ్యవహారంపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటి కంగనా రనౌత్ (Kangana Ranaut). కొంతమంది తనను జైలుకు పంపాలని చూశారంటూ ఆమె చెప్పారు.
ఇంటర్నెట్‌డెస్క్: ఓ ప్రేమ వ్యవహారాన్ని ఉద్దేశిస్తూ ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ పెట్టిన పోస్ట్‌పై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) స్పందించారు. ప్రేమలో తనకు ఎదురైన ఇబ్బందులను వెల్లడించారు. సినిమా మాఫియా తనని జైలుకు పంపాలని చూసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
‘‘ప్రభుత్వాన్ని కూల్చకుండా అడ్డుకునేందుకు సీఏఐ పంపిన నకిలీ వ్యక్తి అని తెలిసినా.. వారితో ప్రేమలో పడటం విభిన్నమైన అనుభూతి’’ అంటూ ఎలాన్ మస్క్ ఓ పోస్ట్ పెట్టారు. దీనిని చూసిన నెటిజన్లు.. తన ప్రేమ గురించే ఆయన మాట్లాడుతున్నారని అనుకున్నారు. ఈక్రమంలోనే కంగన ఆయన ట్వీట్‌పై కామెంట్ చేశారు. ‘‘నాకంటే నాటకీయమైన జీవితం ఎవరికీ ఉండదు. ఓ ప్రేమ వ్యవహారంలో మొత్తం సినిమా మాఫియా నన్ను జైలుకి పంపించడానికి ప్రయత్నించిన దానికంటే మస్క్ పెట్టిన ట్వీట్ కాస్త ఆసక్తికరంగా ఉంది’’ అని ఆమె వ్యాఖ్యలు చేశారు.
కంగన గతంలో బాలీవుడ్ నటుడు హృతిక్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు. ఈ క్రమంలోనే హృతిక్‌పై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. వీళ్లిద్దరి మధ్య నెలకొన్న వివాదం కోర్టు వరకూ వెళ్లింది. ప్రస్తుతం ఆమె పెట్టిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారడంలో పలువురు నెటిజన్లు.. ఆమె లవ్‌స్టోరీ గురించే మాట్లాడుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Giant wheel: వామ్మో.. సరదాగా జెయింట్ వీల్ ఎక్కితే నరకం కనిపించింది!
-
Japan : మరోసారి పసిఫిక్ మహా సముద్రంలోకి అణుజలాలు విడుదల.. ప్రకటించిన జపాన్
-
Prithviraj Sukumaran: రోజుకు 9 గంటలు ఫిజియోథెరపీ.. హెల్త్ అప్డేట్పై హీరో పోస్ట్
-
PCB Chief: పాకిస్థాన్ క్రికెట్ చీఫ్ వ్యాఖ్యలపై నెట్టింట తీవ్ర విమర్శలు!
-
Hacking: అమెరికా కీలక ఈ మెయిల్స్‌ను తస్కరించిన చైనా హ్యాకర్లు !
-
Chandrababu Arrest: సెప్టెంబర్ 30న ‘మోత మోగిద్దాం!’.. వినూత్న నిరసనకు తెదేపా పిలుపు