Kangana Ranaut: రూ.500లతో ముంబయి వచ్చా
ఆకట్టుకునే నటనతోనే కాదు.. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో ఉండే నటి కంగనా రనౌత్ (Kangana Ranaut). తను దర్శకనిర్మాతగా మారి ‘ఎమర్జెన్సీ’ని తెరకెక్కిస్తోంది.
ఆకట్టుకునే నటనతోనే కాదు.. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో ఉండే నటి కంగనా రనౌత్ (Kangana Ranaut). తను దర్శకనిర్మాతగా మారి ‘ఎమర్జెన్సీ’ని తెరకెక్కిస్తోంది. 1975నాటి ఎమర్జెన్సీ చీకటి రోజుల్లోని వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో కంగనా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్ర పోషిస్తోంది. ఈ సందర్భంగా ఆమె తన పాత ఇంటర్వ్యూల్లో చెప్పిన ఆసక్తికర విషయాలతో కూడిన ఓ వీడియోని ఆదివారం పంచుకుంది. ఇందులో తనకి వంటపై ఉన్న అమితమైన ఇష్టాన్ని తెలియజేసింది. ఆ ఇష్టంతోనే సొంతంగా ఒక రెస్టారెంట్‌ని ప్రారంభించాలనుకుంది. కానీ తను నటించిన చివరి చిత్రం ‘ధాకడ్’ తీవ్రంగా నిరాశ పరచడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ ప్రయత్నం నెరవేరలేదట. తర్వాత తనే నిర్మాత, దర్శకురాలిగా మారి ‘ఎమర్జెన్సీ’ తెరకెక్కిస్తోంది. దీనికోసం కంగనా ఇంటితో సహా విలువైన వస్తువులన్నీ తాకట్టు పెట్టి మరీ ఈ సినిమా నిర్మిస్తున్నానని చెప్పింది. ఈ వివరాలే పేర్కొంటూ ‘చేతిలో ఐదువందల రూపాయలతో ముంబయి నగరానికి వచ్చాను. ఒకవేళ ఈ చిత్రంతో మొత్తం కోల్పోతే నేను మళ్లీ మొదటి పరిస్థితికే వస్తాను. అయినా నేనేం ఆత్మవిశ్వాసం కోల్పోను. నా కాళ్లపై నేను నిలబడతాననే నమ్మకం ఉంది’ అంటూ గతాన్ని ఓసారి గుర్తు చేసుకుంది కంగనా.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Adipurush: ‘ఆది పురుష్’.. వాళ్లు కచ్చితంగా చూడాల్సిన చిత్రం: కృతి సనన్
-
World News
China: రేపు అంతరిక్షంలోకి పౌర వ్యోమగామి.. ఏర్పాట్లు సర్వం సిద్ధం..!
-
General News
Isro-Sriharikota: నింగిలోని దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్12.. ప్రయోగం విజయవంతం
-
Politics News
Karnataka: సిద్ధరామయ్య వద్దే ఆర్థికం.. డీకేకు నీటిపారుదల
-
Crime News
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం
-
Sports News
MS Dhoni: రిజర్వ్‌డే మ్యాచ్.. గత చరిత్రను ధోనీ తిరగరాస్తాడా...?