Kangana Ranuat: వాళ్లు ఉడకబెట్టిన కోడిగుడ్లలా ఉంటారు: కంగన

బాలీవుడ్‌ చిత్రాలపై దక్షిణాది సినిమాలు విజయం సాధించడానికి గల కారణంపై నటి కంగనా రనౌత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తదుపరి చిత్రం ‘ధాకడ్‌’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమె తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు...

Published : 17 May 2022 01:58 IST

బాలీవుడ్‌ సినిమాలు ప్రేక్షకులకు ఎందుకు కనెక్ట్‌ కావడం లేదంటే..?

ముంబయి: బాలీవుడ్‌ చిత్రాలపై దక్షిణాది సినిమాలు విజయం సాధించడానికి గల కారణంపై నటి కంగనా రనౌత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తదుపరి చిత్రం ‘ధాకడ్‌’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమె తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆమె మరోసారి నెపోటిజంపై మండిపడ్డారు. టాలెంట్, లుక్స్‌ ఉన్నప్పటికీ బయటవారికంటే కూడా స్టార్‌కిడ్స్‌కే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారని అన్నారు.

‘‘దక్షిణాది వాళ్లు ఆడియన్స్‌తో కనెక్ట్‌ అయ్యేలా సినిమాలు చేస్తున్నారు. అక్కడి నటీనటులు ఏ పాత్రల్లోనైనా నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘పుష్ప’ చిత్రాన్ని తీసుకుంటే.. అందులో హీరో కూలీ పని చేసే వ్యక్తిగా కనిపించాడు. ఇక, మన హీరోలు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా అలాంటి పాత్రలు పోషించారా? దక్షిణాది చిత్రాల్లో సంస్కృతి, సంప్రదాయాలకు ఇచ్చే ప్రాధాన్యతే.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఆ చిత్రాలకు కనెక్ట్‌ అయ్యేలా చేస్తున్నాయి. మరోవైపు ఈ మధ్యకాలంలో బాలీవుడ్‌ నుంచి వస్తోన్న చిత్రాలు చూస్తే.. వాటిల్లో బీటౌన్‌ స్టార్ల పిల్లలే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చదువుల నిమిత్తం చిన్నప్పటి నుంచి విదేశాల్లో పెరిగిన వాళ్లు.. అక్కడి పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడిపోతారు. వాళ్ల భాష, ఆహారపు అలవాట్లు అన్నీ విభిన్నంగానే ఉంటాయి. వాళ్ల లుక్స్‌ కూడా భయానకంగా, ఉడకబెట్టిన కోడిగుడ్లలా ఉంటాయి. మరి, అలాంటప్పుడు వాళ్లకు ప్రేక్షకులు ఎందుకు కనెక్ట్‌ అవుతారు’’ అని కంగన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని