Kangana Ranaut: ‘పఠాన్‌’ విజయంపై నిర్మాత ట్వీట్‌.. కంగనా రనౌత్‌ కామెంట్‌!

ఇండియా కొన్ని సందర్భాల్లో ఖాన్‌లను మాత్రమే ప్రేమిస్తుందని కంగనా రనౌత్‌ అన్నారు. ట్విటర్‌ వేదికగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

Published : 30 Jan 2023 00:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌ మీడియా వేదికగా ప్రతి విషయంపై స్పందించే బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut). తాజాగా ఆమె చేసిన ట్వీట్‌ చర్చకు దారి తీసింది. ‘పఠాన్‌’ (Pathaan) విజయం సాధించిందంటూ నిర్మాత ప్రియా గుప్త.. హీరో షారుఖ్‌ ఖాన్‌, హీరోయిన్‌ దీపికా పదుకొణెకు శుభాకాంక్షలు చెప్పి, వారి ట్విటర్‌ ఖాతాలను ట్యాగ్‌ చేశారు. ‘‘షారుఖ్‌ను హిందువులు, ముస్లింలు సమానంగా ప్రేమిస్తారు, బాయ్‌కాట్‌ విమర్శలు సినిమాకు నష్టం చేయవు.. సహాయపడతాయి. రొమాన్స్‌, మంచి సంగీతం మెప్పిస్తాయి. ఇండియా సెక్యులర్‌ దేశం’ అనే విషయాలను పఠాన్‌ నిరూపించింది’’ అని ఆమె పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కంగనా.. అది చాలా మంచి విశ్లేషణ అని తనదైన శైలిలో కామెంట్‌ చేశారు. ‘‘ఈ దేశం కొన్ని సందర్భాల్లో కేవలం ఖాన్‌లను మాత్రమే ప్రేమిస్తుంది. ముస్లిం నటీమణులపైనే ఇష్టం చూపిస్తుంది. అందుకే ఇండియాలో ద్వేషం, ఫాసిజం ఉన్నాయనడం అన్యాయం. ప్రపంచంలో భారత్‌లాంటి దేశం మరొకటి లేదు’’ అని వ్యాఖ్యానించారు.

కంగనా ట్వీట్‌పై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమెను సపోర్ట్‌ చేస్తే కొందరు మండిపడుతున్నారు. షారుఖ్‌ఖాన్‌, దీపికా పదుకొణె జంటగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘పఠాన్‌’. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జనవరి 25న విడుదలైంది. తొలిరోజు నుంచే అధిక వసూళ్లు చేస్తూ బాలీవుడ్‌లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు