Kangana Ranaut: ఎవరినైనా బాధ పెట్టుంటే క్షమించండి: కంగనా రనౌత్
సోషల్ మీడియాలో చురుకుగా ఉండే కథానాయికల్లో కంగనా రనౌత్ ఒకరు. తన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక వీడియోను ఆమె పంచుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇప్పటి వరకు తాను చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధ పడి ఉంటే క్షమించాలని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) కోరారు. దేశ సంక్షేమం కోసం తాను అలా మాట్లాడుతుంటానని, అందరికీ మంచి జరగాలనేదే తన ఉద్దేశమనన్నారు. తన ప్రయాణంలో భాగమైన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గురువారం తన పుట్టినరోజు సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. తన తల్లిదండ్రులు, ఆధ్యాత్మిక గురువులు సద్గురు, స్వామి వివేకానందకు ధన్యవాదాలు చెప్పిన కంగన తన శత్రువులనూ గుర్తుచేసుకున్నారు. ‘‘నా శత్రువులు నన్ను విశ్రాంతి తీసుకోకుండా పని చేసేలా చేస్తున్నారు. నా విజయానికి కారణమయ్యారు. సమస్యలను ఎలా అధిగమించాలో, ఎలా పోరాడాలో వారే నాకు నేర్పించారు. వారికి నేనెప్పటికీ కృతజ్ఞురాలిని’’ అని కంగన పేర్కొన్నారు. పుట్టినరోజుని పురస్కరించుకుని.. ఉదయ్‌పుర్‌లోని అంబికా మాత ఆలయాన్ని సందర్శించానని మరో పోస్ట్ ద్వారా తెలిపారు.
అభిమానులు, నెటిజన్లు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. కంగన ప్రతి అంశంపై తనదైన శైలిలో స్పందిస్తూ వార్తలో నిలుస్తుంటారనే సంగతి తెలిసిందే. 1987 మార్చి 23న పుట్టిన కంగన 2006లో హిందీ చిత్రం ‘గ్యాంగ్‌స్టర్’తో నటిగా కెరీర్ ప్రారంభించారు. ‘ఏక్ నిరంజన్’తో తెలుగు ప్రేక్షకులను పరిచయమైన ఆమె ‘ఎమర్జెన్సీ’ (Emergency)లో నటిస్తున్నారు. ఆ సినిమాకి దర్శకత్వ బాధ్యతా తీసుకున్నారు. భారత రాజకీయ చరిత్రలో ఓ ప్రధాన ఘట్టమైన ఎమర్జెన్సీ రోజుల నాటి ఆసక్తికర కథాంశంతో ఆ చిత్రం రూపొందుతోంది. మరోవైపు, ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2)లోని తన పాత్ర చిత్రీకరణను ఇటీవల పూర్తి చేశారు. రాఘవ లారెన్స్ హీరోగా దర్శకుడు పి. వాసు తెరకెక్కిస్తున్న చిత్రమది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ekyc: గల్ఫ్ వలసదారుల్లో ఈకేవైసీ గుబులు
-
Asifabad: బడికెళ్లాలంటే.. ఈత రావాలి
-
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో కాంపోజిట్ తెలుగు కొనసాగింపు
-
ఆ ఇంటికి దీపం ‘స్వర్ణభారత్’.. దత్తత తీసుకున్న అమ్మాయికి వివాహం జరిపించిన మాజీ ఉపరాష్ట్రపతి కుమార్తె
-
Rain Alert: నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు