Sita Ramam: ఆమెలా మరెవరూ నటించలేరు: కంగనా రనౌత్‌

అందమైన ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అఖండ విజయాన్ని అందుకున్న సినిమా ‘సీతారామం’. ఈ సినిమాపై సినీ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. సీతగా మృణాల్‌ ఠాకుర్‌, రామ్‌గా దుల్కర్‌ సల్మాన్‌ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసులు దోచేశారు.

Updated : 22 Sep 2022 13:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అందమైన ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అఖండ విజయాన్ని అందుకున్న సినిమా ‘సీతారామం’. ఈ చిత్రంపై సినీ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. సీత పాత్రలో మృణాల్‌ ఠాకూర్‌, రామ్‌గా దుల్కర్‌ సల్మాన్‌ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసులు దోచేశారు. తాజాగా ఈ సినిమాపై కంగనా రనౌత్‌ స్పందించారు. ఈ చిత్రంలోని పాత్రధారులు చాలా బాగా నటించారని ప్రశంసించారు. ‘జిందాబాద్‌ ఠాకూర్ సాబ్‌’ అంటూ మృణాల్‌ నటనను ప్రత్యేకంగా కొనియాడారు. 

తన ఇన్‌స్టా స్టోరీలో కంగనా ఈ సినిమా గురించి పోస్ట్ చేస్తూ.. ‘సీతారామంలో నటీనటులందరూ అద్భుతంగా నటించారు. అయితే, నాకు మృణాల్‌ నటన ప్రత్యేకంగా అనిపించింది. తను భావోద్వేగపూరితమైన సన్నివేశాల్లో ఎంతబాగా చేసిందో. తనలా మరెవరూ నటించలేరు. ఆమె నిజంగా రాణి. జిందాబాద్‌ ఠాకూర్‌ సాబ్. ఇక మీ పాలన ప్రారంభమైంది’ అంటూ తన నోట్‌లో ఒక రాణి ఎమోజీని కూడా కంగనా పోస్ట్‌ చేశారు.  హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక, సుమంత్, గౌతమ్‌ మేనన్‌, ప్రకాష్‌ రాజ్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. యుద్ధం నేపథ్యంతో రాసిన ఈ ప్రేమకథను తెలుగుతో పాటు, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని