Updated : 05/12/2021 15:02 IST

Kangana: వారి తరఫున ఎన్నికల్లో ప్రచారం చేస్తా: కంగన

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి కంగనా రనౌత్‌.. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. కొన్ని సందర్భాల్లో భాజపాకి మద్దతుగా మాట్లాడటంతో ఆమె ఆ పార్టీలో చేరే అవకాశాలున్నాయని ఊహగానాలు కూడా వినిపించాయి. అయితే,  ఈ విషయంపై కంగనా రనౌత్‌ తాజాగా స్పష్టతనిచ్చారు. తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని వెల్లడించారు. శనివారం ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఉన్న శ్రీకృష్ణ జన్మస్థలాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు విలేకరులు ఆమెను యూపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో భాజపా తరఫున ప్రచారం చేస్తారా? అని ప్రశ్నించారు. దీనికి కంగనా ‘‘నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు. కానీ, జాతీయవాదుల తరఫున ప్రచారం చేస్తా’’అని సమాధానం ఇచ్చారు.

అలాగే, శ్రీకృష్ణ జన్మస్థలంపై కూడా కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువుల పవిత్రక్షేత్రమైన శ్రీకృష్ణ జన్మస్థలంలో ఈద్గా ఉందని.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ చర్యలు చేపట్టి అసలైన పుణ్యస్థలాన్ని ప్రజలకు చూపిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తన వ్యాఖ్యలు కొంతమంది మనోభావాలను దెబ్బతీసినా.. నిజాయతీపరులు, ధైర్యవంతులు, జాతీయవాదులు వాస్తవాన్ని గుర్తిస్తారని చెప్పారు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్