Kanguva: చకచకా ‘కంగువ’

సూర్య కథానాయకుడిగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బహుభాషా చిత్రం ‘కంగువ’. యూవీ క్రియేషన్స్‌, స్టూడియో గ్రీన్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Updated : 15 May 2023 11:32 IST

సూర్య కథానాయకుడిగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బహుభాషా చిత్రం ‘కంగువ’. యూవీ క్రియేషన్స్‌, స్టూడియో గ్రీన్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దిశా పటానీ కథానాయిక. మృణాల్‌ ఠాకూర్‌ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ కొన్నాళ్లుగా కొడైకెనాల్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్‌ తాజాగా ముగిసింది. ఈ విషయాన్ని దర్శకుడు శివ సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. ఈ షెడ్యూల్‌లో భాగంగా సూర్యపై యాక్షన్‌తో పాటు పలు కీలక సన్నివేశాలు తెరకెక్కించినట్లు తెలిసింది. నెలాఖరు నుంచి మరో కొత్త షెడ్యూల్‌ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. జూన్‌ చివరి నాటికి సినిమా పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యాక్షన్‌తో కూడిన భారీ పీరియాడిక్‌ డ్రామా చిత్రమిది. ఇందులో సూర్య ఐదు భిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్నట్లు సమాచారం. దీన్ని త్రీడీలో దాదాపు పదికి పైగా భాషల్లో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని