Kanmani Rambo Khatija review: రివ్యూ: కణ్మణి ర్యాంబో ఖతీజా
Kanmani Rambo Khatija review: విజయ్ సేతుపతి, నయనతార, సమంత కీలక పాత్రల్లో నటించిన ‘కణ్మణి ర్యాంబో ఖతీజా’ ఎలా ఉందంటే?
చిత్రం: కణ్మణి ర్యాంబో ఖతీజా; నటీనటులు: విజయ్ సేతుపతి, నయనతార, సమంత, ప్రభు, కళా మాస్టర్, సీమ, రెడిన్ కింగ్స్లే తదితరులు; సంగీతం: అనిరుధ్ రవిచందర్; సినిమాటోగ్రఫీ: ఎస్.ఆర్.కథిర్, విజయ్ కార్తీక్ కన్నన్; ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్; నిర్మాత: విఘ్నేశ్ శివన్, నయనతార, ఎస్.ఎస్.లలిత్ కుమార్; రచన, దర్శకత్వం: విఘ్నేశ్ శివన్; విడుదల: 28-04-2022
కొన్ని సినిమాలు కాంబినేషన్‌తోనే ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. అలాంటి చిత్రాల్లో కాతువాక్కుల రెండు కాదల్ ఒకటి. తెలుగులో కణ్మణి ర్యాంబో ఖతీజా పేరుతో విడుదల చేశారు. విజయ్ సేతుపతి- నయనతార - సమంత ప్రధాన పాత్రధారులుగా రొమాంటిక్ కామెడీ కథ అనగానే ప్రేక్షకులు ప్రత్యేకమైన ఆసక్తి కనబరిచారు. ప్రచార చిత్రాలు కూడా అందుకు తగ్గట్టే ఆకర్షించాయి. కానీ, తెలుగులో ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చిందీ చిత్రం. మరి ఈ చిత్ర కథేంటి? ఎలా ఉంది? విఘ్నేశ్ శివ ఎలా తీశారు?(Kanmani Rambo Khatija Review)
కథేంటంటే: ర్యాంబో (విజయ్ సేతుపతి)(Vijay Sethupathi) తనని తాను దురదృష్టవంతుడిగా భావిస్తుంటాడు. చిన్నప్పట్నుంచి తన చుట్టూ జరిగిన సంఘటనలు అలాంటివి. తనకి ఇష్టమైనది ఏదీ తనకి దక్కదు. తన తల్లికి కూడా దూరంగా ఉంటేనే ఆమె ఆరోగ్యంగా ఉంటుందని భావిస్తుంటాడు. కానీ, తన తల్లి మాత్రం ఏదో ఒక రోజు ప్రేమలో తడిసి ముద్దవుతావని, నీకు ఇష్టమైనవన్నీ నీకు దక్కుతాయని చెబుతుంది. పట్నం వెళ్లి అక్కడే పగలు క్యాబ్ డ్రైవర్‌గా, రాత్రిళ్లు పబ్‌లో బౌన్సర్‌గా పనిచేస్తున్న ర్యాంబోకి తన తల్లి చెప్పినట్టుగానే ఒకేసారి ఇద్దరి మనసుల్ని సొంతం చేసుకుని వారి ప్రేమలో తడిసి ముద్దవుతాడు. (Kanmani Rambo Khatija Review) కణ్మణి (నయనతార)(Nayanthara), ఖతీజా (సమంత)(Samanth)లని ప్రేమించిన ర్యాంబోకి ఆ తర్వాత అసలు సమస్య ఎదురవుతుంది? ఆ ఇద్దరు అమ్మాయిలకీ విషయం తెలిశాక ఏం జరిగింది? ఇద్దరిలో ర్యాంబో ఎవరిని ఎంచుకున్నాడనేది తెరపైనే చూడాలి.
ఎలా ఉందంటే: ఒక వ్యక్తి ఒకేసారి ఇద్దరితో ప్రేమలో పడటం అనేది చాలా సినిమాల్లో చూసిందే. నిజానికి ఇది చాలా సీరియస్ అంశం. దర్శకుడు విఘ్నేష్ శివన్ మాత్రం అలాంటి అంశానికి సున్నితమైన హాస్యాన్ని మేళవించి ఈ చిత్రాన్ని సీరియస్‌గా కాకుండా సరదాగా చూడాలని చెప్పకనే చెప్పారు. విఘ్నేష్ శివన్ శైలి చమత్కారం, సంఘర్షణ ఉన్న కథ ఇది. ఒక అద్భుతం జరగడానికి ముందు వచ్చే ఓ కుదుపు అంటూ కథని మొదలు పెట్టాడు దర్శకుడు. ర్యాంబో కుటుంబానికి ఉన్న శాపం, అతను పల్లెటూరి నుంచి పట్నానికి రావడం వంటి అంశాలతో కథలోకి తీసుకెళ్లాడు. (Kanmani Rambo Khatija Review)ఆ తర్వాత ర్యాంబో పగటి జీవితం, రాత్రి జీవితాల్ని చూపెడుతూ... ఆ జీవితాల్లోకి ఇద్దరమ్మాయిలు రావడం, వాళ్లతో ప్రేమలో పడే వైనాన్ని ఆవిష్కరించారు. మధ్యలో కొన్ని సన్నివేశాలు మరీ నిదానంగా సాగినట్టు అనిపించినా, విరామానికి ముందు వచ్చే సన్నివేశాలతో కథలో ఆసక్తి మొదలవుతుంది.
ర్యాంబో(Vijay Sethupathi) ఎవరిని ఎంచుకుంటాడనే ఉత్కంఠ మొదలవుతుంది. కానీ లవ్ యూ ‘టూ’ అనడంతో ఆ ఉత్కంఠ చివరి వరకు అలా కొనసాగుతుంది. విరామం తర్వాత టీ - కాఫీ, బాదం - పిస్తా అంటూ వచ్చే సన్నివేశాలు నవ్వులు పంచాయి. రెండు కత్తులు ఒక ఒరలో ఇమడనట్టుగానే, ఇద్దరమ్మాయిలు ఒక వ్యక్తితో కలిసి ప్రయాణం చేయడం చాలా కష్టం. (Kanmani Rambo Khatija Review) అలా ఆలోచిస్తే ఈ కథతో ఏ దశలోనూ కనెక్ట్ కాలేడు ప్రేక్షకులు. కానీ దర్శకుడు దాన్ని సీరియస్‌గా కాకుండా, వినోదాత్మకంగా మలిచారు. నయనతార, సమంత మధ్య సన్నివేశాలు నవ్విస్తాయి. పతాక సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. ఇలా జరగడం నమ్మశక్యమా అంటూ వాస్తవికత గురించి ఆలోచించకుండా, కాలక్షేపం కోసం మాత్రమే అన్నట్టుగా సినిమా చూస్తే ఏ సమస్యా ఉండదు. అలా కాకుండా లాజికల్‌గా ఆలోచిస్తే మాత్రం ఈ సినిమా అంతగా మెప్పించదు.
ఎవరెలా చేశారంటే: విజయ్ సేతుపతి(Vijay Sethupathi), సమంత(Samanth), నయనతార(Nayanthara) నటనే చిత్రానికి ప్రధాన బలం. వాళ్లు ఆయా పాత్రల్లో అవలీలగా ఒదిగిపోయి నటించారు. పర్ఫెక్ట్ టైమింగ్‌తో నవ్వించారు. నిజానికి నటులే ఈ కథలో ఉన్న సగం మైనస్‌లని కనిపించనీయకుండా చేశారు. కణ్మణి, ఖతీజా పాత్రలకి నయనతార, సమంత సరైన ఎంపిక అనిపించారు. విజయ్ సేతుపతి (Vijay Sethupathi) విరామ సన్నివేశాలకి ముందు తన అభినయంతో అలరిస్తారు. ఇద్దరి వైపు చూస్తూ ఇద్దరినీ ప్రేమిస్తున్నానన్నట్టుగా చెప్పే సంభాషణలు సినిమాకే హైలైట్. ప్రభు, శ్రీశాంత్ తదదితర నటులు పాత్రల పరిధి మేరకు నటించారు.(Kanmani Rambo Khatija Review) సాంకేతిక విభాగాల్లో అనిరుధ్ సంగీతానికి ఎక్కువ మార్కులు పడతాయి. ఆయన సంగీతం చిత్రానికి ప్రధాన బలం. ఎడిటింగ్ విభాగం కూడా చక్కటి పనితీరుని కనబరిచింది. విఘ్నేష్ శివన్ దర్శకుడిగా మెప్పిస్తాడు కానీ, రచన పరంగా అక్కడక్కడా స్క్రిప్ట్‌లో సమస్యలు కనిపిస్తాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
బలాలు
+ ప్రధాన నటులు
+ హాస్యం
+ ద్వితీయార్ధం
బలహీనతలు
- సాగదీతగా అనిపించే కొన్ని సన్నివేశాలు
- వాస్తవికత లేని కథ
చివరిగా: కణ్మణి ఖతీజా ర్యాంబో... కొన్ని నవ్వుల కోసం
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
Om Bhim Bush Review; రివ్యూ: ఓం భీమ్ బుష్.. కామెడీ ఎంటర్టైనర్ అలరించిందా?
om bhim bush review: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ‘ఓం భీమ్ బుష్’ ఎలా ఉందంటే? -
ThulasiVanam Review: రివ్యూ: తులసీవనం: మిడిల్‌క్లాస్ కుర్రాడి బయోపిక్
ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ‘తులసీవనం’ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే? -
Abraham Ozler review: రివ్యూ: అబ్రహాం ఓజ్లర్.. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Abraham Ozler review: జయరామ్, మమ్ముట్టి కీలక పాత్రల్లో నటించిన ‘అబ్రహాం ఓజ్లర్’ ఎలా ఉందంటే? -
Save The Tigers 2 Review: రివ్యూ: సేవ్ ది టైగర్స్ సీజన్ 2.. నవ్వులు రిపీట్ అయ్యాయా?
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘సేవ్ ది టైగర్స్ 2’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో విడుదలైన ఈ సిరీస్ ఎలా ఉందంటే? -
Sharathulu Varthisthai Review: రివ్యూ: షరతులు వర్తిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?
Sharathulu Varthisthai Review: చైతన్యరావు కీలక పాత్రలో నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ మూవీ మెప్పించిందా? -
Yodha Review: రివ్యూ: యోధ.. యాక్షన్ థ్రిల్లర్ మెప్పించిందా?
సిద్ధార్థ్ మల్హోత్రా, రాశీఖన్నా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను అలరించిందా..? -
Razakar Movie Review: రివ్యూ: రజాకార్.. బాబీ సింహా, అనసూయ నటించిన మూవీ ఎలా ఉంది?
Razakar Movie Review: తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో రూపొందిన ‘రజాకార్’ ఎలా ఉందంటే? -
Merry Christmas review: రివ్యూ: మెర్రీ క్రిస్మస్.. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ నటించిన చిత్రం ఎలా ఉందంటే?
విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మెర్రీ క్రిస్మస్’. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎలా ఉందంటే? -
Anweshippin Kandethum Review: రివ్యూ: అన్వేషిప్పిన్ కండెతుమ్.. మలయాళ బ్లాక్‌బస్టర్ ఎలా ఉంది?
Anweshippin Kandethum Review: టొవినో థామస్ కీలకపాత్రలో నటించిన పోలీస్ ప్రొసీడల్ డ్రామా మెప్పించిందా? -
Shaitaan Movie Review: రివ్యూ: షైతాన్.. మాధవన్ నెగెటివ్ షేడ్స్‌లో నటించిన మూవీ మెప్పించిందా?
Shaitaan Movie Review: అజయ్ దేవ్‌గణ్, జ్యోతిక, మాధవన్ కీలక పాత్రల్లో నటించిన మూవీ ఎలా ఉంది? -
Breathe Review: రివ్యూ: బ్రీత్.. నందమూరి చైతన్య కృష్ణ హీరోగా నటించిన సినిమా ఎలా ఉందంటే?
Breathe telugu movie Review: నందమూరి చైతన్య కృష్ణ హీరోగా పరిచయమైన సినిమా ‘బ్రీత్’. వైద్యో నారాయణో హరి అనేది ఉపశీర్షిక. ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం ఎలా ఉందంటే? -
Bhimaa movie review: రివ్యూ: భీమా.. గోపిచంద్ ఖాతాలో హిట్ పడిందా?
Bhimaa movie review: యాక్షన్ హీరోగా పేరుతెచ్చుకున్న గోపిచంద్ కీలక పాత్రలో నటించిన ‘భీమా’ మూవీ మెప్పించిందా? -
Gaami review: విశ్వక్సేన్ నటించిన ‘గామి’ ఎలా ఉందంటే..!
అఘోరాగా విశ్వక్సేన్ నటించిన చిత్రం ‘గామి’. మరి ఈ పాత్రలో విశ్వక్ భయపెట్టాడో.. లేదో తెలుసుకుందాం. -
Premalu Movie Review: రివ్యూ: ప్రేమలు.. మలయాళ బ్లాక్‌బస్టర్ తెలుగులో ఎలా ఉంది?
Premalu Movie Review: మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ప్రేమలు’ తెలుగులోనూ అదే పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఇక్కడి ప్రేక్షకులను మెప్పించిందా? -
Valari Review: రివ్యూ: వళరి.. రితికా సింగ్ నటించిన హారర్ మూవీ ఎలా ఉందంటే?
Valari Review: రితికా సింగ్ నటించిన హారర్ చిత్రం ‘వళరి’. నేరుగా ప్రముఖ ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే? -
The Indrani Mukerjea Story: రివ్యూ: ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ’.. షీనా బోరా హత్య కేసుపై డాక్యుమెంటరీ
షీనా బోరా హత్య కేసుపై రూపొందిన డాక్యుమెంటరీ సిరీస్ ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ’. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
Bhoothaddam Bhaskar Narayana Review: రివ్యూ: భూతద్దం భాస్కర్ నారాయణ.. థ్రిల్ పంచాడా?
Bhoothaddam Bhaskar Narayana Review: శివ కందుకూరి కీలక పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ ఎలా ఉంది? ప్రేక్షకులకు థ్రిల్ పంచిందా? -
Operation Valentine Review: రివ్యూ: ఆపరేషన్ వాలెంటైన్.. వరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
Operation Valentine Review in telugu: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో వరుణ్ తేజ్ కీలక పాత్రలో శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ మెప్పించిందా? -
Malaikottai Vaaliban: రివ్యూ: మలైకోటై వాలిబన్.. మోహన్‌లాల్ నటించిన పీరియాడికల్ చిత్రం ఎలా ఉందంటే?
మలయాళ నటుడు మోహన్‌లాల్ నటించిన తాజా చిత్రం ‘మలైకోటై వాలిబన్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందంటే? -
siddharth roy movie review: రివ్యూ: సిద్ధార్థ్ రాయ్.. దీపక్ సరోజ్ నటించిన మూవీ ఎలా ఉంది?
siddharth roy movie review: ప్రచార చిత్రాలతో ఆసక్తిని పెంచిన ‘సిద్ధార్థ్ రాయ్’ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా?
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు