Major: ‘మేజర్‌’.. హృదయాన్ని మీటే అమ్మ పాట.. ఫుల్‌ వీడియో

ముంబయి ఉగ్రదాడుల సంఘటన, ఆ పోరులో అమరవీరుడైన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ గురించి చాలామందికి తెలుసు. ఆయనెలా జీవించారో కొందరికే తెలుసు. ఆ వీర జవాను జీవితం ప్రతి భారయతీయుడికీ తెలియాలనే ఉద్దేశంతో రూపొందిన చిత్రమే ‘మేజర్‌’.

Published : 21 Jun 2022 01:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 26/11 ముంబయి ఉగ్రదాడుల సంఘటన, ఆ పోరులో అమరవీరుడైన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ గురించి చాలామందికి తెలుసు. ఆయనెలా జీవించారో కొందరికే తెలుసు. ఆ వీర జవాను జీవితం ప్రతి భారతీయుడికీ తెలియాలనే ఉద్దేశంతో రూపొందిన చిత్రమే ‘మేజర్‌’ (Major). అడివి శేష్‌ (Adivi Sesh) టైటిల్‌ పాత్ర పోషించిన ఈ సినిమా ఇటీవల విడుదలై, ప్రేక్షకుల్లో స్ఫూర్తినింపుతోంది. ఈ సినిమాకు వస్తున్న స్పందనకు కానుకగా చిత్ర బృందం ‘కన్నా కన్నా’ అనే ఫుల్‌ వీడియో గీతాన్ని విడుదల చేసింది. సందీప్‌ ఉన్నికృష్ణన్‌ (Sandeep UnniKrishnan) బాల్యం నుంచి ఆయన సైన్యంలో చేరేందుకు బయలుదేరే సన్నివేశాలు ఈ వీడియోలో కనిపించాయి. సందీప్‌ తల్లిగా రేవతి, తండ్రిగా ప్రకాశ్‌రాజ్‌ ఒదిగిపోయారు. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ అమ్మ పాటను చిత్ర ఆలపించారు. శ్రీచరణ్‌ పాకాల స్వరాలందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని