Chetan Kumar: వివాదాస్పద ట్వీట్.. కన్నడ నటుడి అరెస్ట్
ఓ మతాన్ని ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కన్నడ నటుడు చేతన్ కుమార్ (Kannada Actor Chetan Kumar) మరోసారి కటకటకాలపాలయ్యాడు.
బెంగళూరు: కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు చేతన్ కుమార్ (Kannada Actor Chetan Kumar)ను బెంగళూరు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఓ మతాన్ని కించపరుస్తూ ట్వీట్ చేశాడన్న అభియోగాలపై అతడిని అదుపులోకి తీసుకున్న శేషాద్రిపురం పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. దీంతో న్యాయస్థానం అతడికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
చేతన్ (Chetan Kumar) సోమవారం ఓ మతాన్ని కించపరుస్తూ ట్వీట్ చేశాడు. అది కాస్తా వైరల్ కావడంతో కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడిపై ఫిర్యాదు చేశారు. దీంతో అతడి ట్వీట్ రెండు వర్గాల మధ్య ఘర్షణలను రెచ్చగొట్టేలా ఉందన్న అభియోగాలపై పోలీసులు నేడు అతడిని అరెస్టు చేశారు.
కన్నడ నాట చేతన్ అహింస (Chetan Ahimsa)గా గుర్తింపు తెచ్చుకున్న అతడు.. పలు సినిమాల్లో నటించి పాపులర్ అయ్యాడు. సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా ఉండే చేతన్.. దళిత, గిరిజనుల హక్కుల కార్యకర్తగా పనిచేస్తున్నారు. కాగా.. ఈ నటుడు ఇలా వివాదాస్పద వార్తల్లో నిలవడం ఇదే తొలిసారి కాదు. 2022 ఫిబ్రవరిలో హిజాబ్ కేసును విచారిస్తున్న కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కృష్ణ దీక్షిత్‌పై అభ్యంతరకర ట్వీట్ చేసి వివాదాల్లో చిక్కుకున్నాడు. ఆ ట్వీట్ చేసినందుకు గానూ అతడిని పోలీసులు అరెస్టు చేయగా.. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
David Warner: టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్.. అదే ఆఖరు సిరీస్
-
India News
PM Modi: బాధ్యులపై కఠిన చర్యలు : ఒడిశా రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
-
Movies News
Chiranjeevi: గతంలో నేను క్యాన్సర్ బారినపడ్డాను: చిరంజీవి
-
General News
Odisha Train Tragedy: రెండు రైళ్లలో ప్రయాణించిన 316 మంది ఏపీ వాసులు సురక్షితం
-
General News
Train accident: ‘కోరమాండల్’ కాస్త ముందొచ్చుంటే మరింత ఘోరం జరిగేది!
-
India News
Odisha Train Tragedy: 250 మంది ప్రయాణికులతో చెన్నైకి ప్రత్యేకరైలు