Darshan: ఇలాంటివి ఎప్పటికీ నన్ను బలహీనపరచవు.. దాడి తర్వాత తొలిసారి దర్శన్ ట్వీట్
ఇటీవల నటుడు దర్శన్‌పై జరిగిన దాడి ఘటన ప్రస్తుతం కన్నడ చిత్రపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా పెదవి విప్పారు నటుడు దర్శన్.
ఇంటర్నెట్‌డెస్క్: ఇటీవల తనపై జరిగిన దాడి గురించి కన్నడ నటుడు దర్శన్ (Darshan) తొలిసారి మాట్లాడారు. ఈ క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచిన స్నేహితులకు ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు ఆయన తాజాగా ట్విటర్ వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్ పెట్టారు. ‘‘ఈ సమయంలో నాకంటే నా సహ నటీనటులు ఎక్కువగా బాధపడుతున్నారని అర్థమైంది. ఇలాంటి ఘటనలు ఒక మనిషిని బలహీనపరచవు. మరింత దృఢంగా మారుస్తాయి. మన సొంత కన్నడ నేలపైనే ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు చూశాం. న్యాయం కోసం నిలబడిన స్నేహితులు, నటీనటులకు ధన్యవాదాలు. సినిమా ఈవెంట్‌ను పక్కదారి పట్టించడానికి ప్రయత్నించిన వాళ్లకూ కృతజ్ఞతలు. ఒక కార్యక్రమాన్ని నాశనం చేయడానికి వంద మంది వ్యక్తులు ఉంటే.. కొన్ని వేల మంది సెలబ్రిటీలు రంగంలోకి దిగుతారని నేను మొదటి నుంచే చెబుతున్నాను. అదే జరిగింది. నాపై పలువురు వ్యక్తులు కనబరుస్తోన్న ప్రేమాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటా’’ అని దర్శన్ పేర్కొన్నారు.
దర్శన్ హీరోగా నటిస్తోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘క్రాంతి’ జనవరిలో విడుదల కానుంది. ఆదివారం సాయంత్రం ఈ సినిమా నుంచి రెండో పాటను విడుదల చేయడం కోసం చిత్రబృందం హోస్‌పేట్‌లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. టీమ్ మొత్తం స్టేజ్‌పై ప్రసంగిస్తోన్న తరుణంలో ఓ వ్యక్తి దర్శన్ మీదకు చెప్పు విసిరాడు. అయితే, కార్యక్రమం ప్రారంభం కావడానికి ముందు దర్శన్, పునీత్ రాజ్‌కుమార్ అభిమానులు సభాప్రాంగణంలో గొడవ పడ్డారని, కాబట్టి పునీత్ అభిమానే ఇలా చేశారని వార్తలు వచ్చాయి. ఈ ఘటనపై కన్నడ చిత్రపరిశ్రమ అసంతృప్తి వ్యక్తం చేసింది. కిచ్చా సుదీప్, శివరాజ్‌కుమార్, ధనుంజయ్, రమ్య తదితరులు దర్శన్‌కు సపోర్ట్ చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WTC Final: ఆసీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్ పోరు.. భారత్ తుది జట్టు ఇదేనా?
-
Crime News
ప్రభుత్వ హాస్టల్లో యువతిపై హత్యాచారం.. ఆపై అనుమానిత గార్డు ఆత్మహత్య..!
-
World News
Pakistan: డబ్బు కోసం పాక్ తిప్పలు.. అమెరికాలో రూజ్వెల్ట్ హోటల్ తనఖా
-
Crime News
Crime News: భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య
-
General News
TTD Temple: నవీ ముంబయిలో శ్రీవారి ఆలయానికి భూమిపూజ
-
Movies News
Rana: మళ్లీ అలాంటి స్టార్ హీరోలనే చూడాలని ప్రేక్షకులు అనుకోవడం లేదు: రానా