Kantara: ఎదురుచూపులకు తెర.. ఓటీటీలోకి వచ్చేసిన ‘కాంతార’
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన సూపర్‌హిట్ చిత్రం ‘కాంతార’ ఓటీటీలోకి వచ్చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: చిన్న సినిమాగా విడుదలై, పెద్ద విజయాన్ని సాధించింది ‘కాంతార’ (Kantara). ఈ సినిమాను పలుమార్లు థియేటర్లలో చూసినవారు, మిస్ అయిన వారూ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడొస్తుందా? అని ఎంతో ఆసక్తి చూపారు. అంతగా మౌత్‌టాక్ సొంతం చేసుకొందీ చిత్రం. ఈ క్రమంలో కాంతార.. ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో నవంబరు 24న విడుదలవుతుందంటూ ఇటీవల సోషల్ మీడియాలో చర్చ సాగింది. మరోవైపు, పలు కారణాల వల్ల ఆలస్యమయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో వినిపించింది. తాజాగా అదే తేదీని ఓటీటీ సంస్థ ఖరారు చేసింది. అందరి ఎదురుచూపులకు ముగింపు పలుకుతూ.. తాజాగా కాంతార ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రకృతి - మానవాళికి మధ్య ఉండాల్సిన సంబంధాలను తెలియజేసేలా రూ. 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ. 400 కోట్లు వసూళ్లు చేసింది. కర్ణాటకలో ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాని చూసినవారందిరితోనూ ‘ఓఁ’ అనిపించిన నటుడు రిషబ్‌శెట్టి తానే దర్శకత్వం వహించడం విశేషం.
కథేంటంటే: ఓ గొప్ప రాజ్యం.. అంతులేని సంపద.. అందమైన కుటుంబం.. ఇవన్నీ ఉన్నా ఏదో తెలియని లోటుతో మథనపడే ఒక రాజు. మానసిక ప్రశాంతతను వెతుక్కుంటూ దేశమంతా తిరుగుతుండగా ఓ అడవిలో అతనికి ఓ దైవ శిల కనిపిస్తుంది. దాన్ని చూశాక అతనిలో ఓ తెలియని ఆనందం. అంత వరకు తన మనసుని కమ్మేసిన చింత మొత్తం ఆ దైవ రూపాన్ని చూడగానే చటుక్కున మాయమైపోతుంది. అందుకే ఆ దైవ శిలను తనకు ఇచ్చేయమని అక్కడి ఊరి ప్రజల్ని కోరతాడు. దానికి బదులుగా ఆ అడవిని.. దానికి ఆనుకుని ఉన్న భూమిని ఆ ఊరి ప్రజలకు రాసిస్తాడు. ఆ సమయంలో దైవం ఆవహించిన ఓ మనిషి రాజుకు ఓ షరతు విధిస్తాడు. దేవుడికిచ్చిన భూమిని తిరిగి లాక్కునే ప్రయత్నం చేయకూడదని, మాట తప్పితే దైవాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తాడు. అయితే రాజు తదనంతరం రాజకుటుంబానికి చెందిన ఓ వ్యక్తి మాట తప్పుతాడు. తన పూర్వీకులు దానమిచ్చిన భూమిని తిరిగి తీసుకోవాలని ప్రయత్నించగా.. కోర్టు మెట్లపై రక్తం కక్కుకొని చనిపోతాడు. కట్ చేస్తే.. కొన్నేళ్ల తర్వాత ఆ భూమి రిజర్వ్ ఫారెస్ట్‌లో భాగమని, దాన్ని ఊరి ప్రజలు ఆక్రమించుకున్నారని ఫారెస్ట్ ఆఫీసర్ మురళి (కిషోర్) సర్వే చేస్తుంటాడు. అయితే అతని ప్రయత్నాలకు శివ (రిషబ్ శెట్టి) అడుగడుగునా అడ్డుతగులుతుంటాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతాయి.అదే సమయంలో ఊరికి దొరగా వ్యవహరించే.. రాజ వంశీకులైన దేవేంద్ర (అచ్యుత్ కుమార్) తమ భూముల్ని తిరిగి దక్కించుకునేందుకు ఓ కుట్ర పన్నుతాడు. మరి ఆ కుట్ర ఏంటి? దాన్ని శివ ఎలా అడ్డుకున్నాడు? మురళీకి అతనికి మధ్య ఉన్న శత్రుత్వం ఎలాంటి సమస్యల్ని సృష్టించింది? ఊరిలో దేవ నర్తకుడైన గురవ హత్యకు.. వీరికి ఉన్న సంబంధం ఏంటి? ఊరి ప్రజల్ని కాపాడటం కోసం భగవంతుడు ఏం చేశాడు? అన్నది మిగతా కథ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Hanuman OTT: ఎదురుచూపులకు ఫుల్స్టాప్.. ‘హనుమాన్’ తెలుగు వెర్షన్ రిలీజ్
‘హనుమాన్’ చిత్రం ఎట్టకేలకు ఓటీటీలో విడుదలైంది. -
Bhoothaddam Bhaskar Narayana: ఓటీటీలోకి వచ్చేస్తోన్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
ఇటీవల విడుదలై ప్రేక్షకులను అలరించిన ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. -
Inspector Rishi: ఓటీటీలోకి మరో హారర్ క్రైమ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నవీన్ చంద్ర నటించిన తాజా వెబ్ సిరీస్ ‘ఇన్స్పెక్టర్ రిషి’. దీని విడుదల తేదీని తాజాగా ప్రకటించారు. -
ETV Win: ఈటీవీ విన్లో ‘ఏం చేస్తున్నావ్?’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ఈటీవీ విన్ ప్రేక్షకులను అలరించేందుకు మరో యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చేస్తోంది. -
Oscars 2024: ఆస్కార్ గెలిచిన సినిమాలు.. స్ట్రీమింగ్ ఇక్కడే..
ఆస్కార్ బరిలో పోటీపడి గెలుపొందిన సినిమాలు ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయోనని తెగ వెతికేస్తున్నారు. -
Main Atal Hoon: ఓటీటీలో వాజ్‌పేయీ బయోపిక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Main Atal Hoon: పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలో నటించిన ‘మై అటల్ హూ’ ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమైంది. -
Narakasura: ఓటీటీలో రక్షిత్ ‘నరకాసుర’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
రక్షిత్ అట్లూరి కథానాయకుడిగా నటించిన ‘నరకాసుర’ ఓటీటీలోకి వచ్చేసింది. -
Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో ‘షీనా బోరా హత్య’ డాక్యుమెంటరీ సంచలనం.. 18 దేశాల్లో ట్రెండింగ్..
‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: ది బరీడ్ ట్రూత్’ 18 దేశాల్లో ట్రెండింగ్‌లో ఉంది. -
ooru peru bhairavakona ott: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘ఊరు పేరు భైరవకోన’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ooru peru bhairavakona ott release date: సందీప్ కిషన్ నటించిన ‘ఊరు పేరు భైరవకోన’ మహాశివరాత్రి సందర్భంగా ఓటీటీలో విడుదలైంది. -
merry christmas ott: ఓటీటీలో ‘మెర్రీ క్రిస్మస్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Merry Christmas ott release date: కత్రినాకైఫ్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించిన ‘మెర్రీ క్రిస్మస్’ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. -
OTT: ఓటీటీల వల్ల దర్శకులకు ఈ టెన్షన్ తగ్గింది: రాజ్ అండ్ డీకే
దర్శకులు రాజ్ అండ్ డీకే ఓటీటీలపై వారి అభిప్రాయాలను పంచుకున్నారు. -
Bramayugam ott: ఓటీటీలో ‘భ్రమయుగం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
bramayugam ott release date: మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ‘భ్రమయుగం’ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. -
12th Fail: ఓటీటీలోకి ‘12th ఫెయిల్’ తెలుగు వెర్షన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
దేశవ్యాప్తంగా విశేష ఆదరణ సొంతం చేసుకున్న ‘12th ఫెయిల్’ చిత్రం తెలుగు వెర్షన్ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. -
Breathe: ఓటీటీలోకి నందమూరి చైతన్య కృష్ణ ‘బ్రీత్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నందమూరి చైతన్యకృష్ణ హీరోగా నటించిన ‘బ్రీత్’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. -
Sound Party ott: ఓటీటీలో ‘సౌండ్ పార్టీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బిగ్‌బాస్ విన్నర్ వీజే సన్నీ కథానాయకుడిగా నటించిన ‘సౌండ్ పార్టీ’ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. -
Ae Watan Mere Watan: కరణ్ జోహార్-సారా మూవీ నేరుగా ఓటీటీలోకి.. ట్రైలర్ చూశారా?
Ae Watan Mere Watan: సారా అలీఖాన్ కీలక పాత్రలో నటించిన ‘ఏ వతన్ మేరే వతన్’ ట్రైలర్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో విడుదల చేసింది. -
The Kerala Story: ఓటీటీలో ‘ది కేరళ స్టోరీ’ రికార్డు.. వాచ్ టైం ఎంతంటే!
సుదీప్తోసేన్ దర్శకత్వంలో అదాశర్మ ప్రధానపాత్రలో నటించిన ‘ది కేరళ స్టోరీ’ ఓటీటీలో రికార్డు సృష్టించింది -
Save The Tigers 2: ‘సేవ్ ది టైగర్స్-2’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Save the tigers-2: కుటుంబ ప్రేక్షకులను అలరించిన సేవ్ ది టైగర్స్‌కు సీక్వెల్‌గా సీజన్2 రాబోతోంది. -
Abraham Ozler: మలయాళంలో రూ.40కోట్లు వసూలు చేసిన క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలో వచ్చేస్తోంది
Abraham Ozler: సంక్రాంతి సందర్భంగా విడుదలై మలయాళంలో ఘన విజయం సాధించిన ‘అబ్రహాం ఓజ్లర్’ ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమైంది. -
Anweshippin Kandethum: ఓటీటీలో మరో మలయాళ థ్రిల్లర్.. టొవినో థామస్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
టొవినో థామస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన మలయాళ పోలీస్ డ్రామా ‘అన్వేషిప్పిన్ కండెతుమ్’ ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. -
Indrani Mukerjea: ఓటీటీలోకి వచ్చేసిన షీనా బొరా హత్య కేసు డాక్యుమెంటరీ..
‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: ది బరీడ్ ట్రూత్’ స్ట్రీమింగ్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
MLC Kavitha: సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కవిత
-
IPL 2024: రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య కెప్టెన్సీలో పోలికలు ఇవే: ధ్రువ్ జురెల్
-
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్‌కు అదనపు బాధ్యతలు
-
Liquor Policy Case: రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్
-
POLL: రోహిత్‌ను కాదని హార్దిక్‌కు కెప్టెన్సీ... ముంబయి ఇండియన్స్ నిర్ణయం సరైనదేనా?
-
Modi: ‘మీవాళ్లు క్షేమంగా ఉన్నారు..త్వరలో తిరిగొస్తారు’: బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై