Kantara: ఓటీటీలో ‘కాంతార’ సందడి

ఈ ఏడాది దక్షిణాది చిత్రసీమలో కొత్త ఉత్సాహాన్ని నింపిన చిత్రం ‘కాంతార’. కన్నడలో చిన్న చిత్రంగా విడుదలై ఆ తర్వాత విజయం అందుకుంది.

Updated : 24 Nov 2022 07:26 IST

ఈ ఏడాది దక్షిణాది చిత్రసీమలో కొత్త ఉత్సాహాన్ని నింపిన చిత్రం ‘కాంతార’ (Kantara). కన్నడలో చిన్న చిత్రంగా విడుదలై ఆ తర్వాత విజయం అందుకుంది. వివిధ భాషల్లోకి అనువాదమై అక్కడా ఊహించని వసూళ్లు అందుకుంది. ఈ చిత్రం ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.400కోట్లు పైగానే వసూలు చేసింది. ఈ సినిమా ఓటీటీ విడుదలపై పలు తేదీలు వినిపిస్తూ వచ్చాయి. తాజాగా ఈ సినిమాని ఈ నెల 24 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. రిషబ్‌ శెట్టి (Rishab Shetty) నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రమిది. హోంబలే ఫిలిమ్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని