Kantara: ఆ శబ్దం వారి హృదయాల్లో ప్రతిధ్వనించింది...: రిషబ్ శెట్టి
కాంతార సినిమాతో రిషబ్ శెట్టి సూపర్‌సక్సెస్ అందుకున్నారు. కథ బాగుంటే ఏ సినిమాకైనా ప్రేక్షకాదరణ లభిస్తుందని చెప్పాడు ఈ మల్టీటాలెంటెడ్ నటుడు.
హైదరాబాద్: కాంతార సినిమా విడుదలైనప్పటి నుంచి ఏ నోట విన్నా రిషబ్ శెట్టి పేరే వినిపిస్తోంది. ఈ సినిమా తాజాగా డిజిటల్ మాధ్యమంలోనూ అదరగొడుతోంది. ఇటీవల ఓ ఈవెంట్‌లో రిషబ్ శెట్టి మాట్లాడుతూ పాన్ ఇండియా చిత్రానికంటూ విడిగా ఎటువంటి ఫార్ములా ఉండదని అన్నారు. కథ ఎంత బలంగా ఉంటే సినిమా అంత ప్రేక్షకాదరణ పొందుతుందని చెప్పారు. సినిమాలో ఉన్న భావోద్వేగాలు భాషాపరమైన హద్దులను చెరిపివేస్తాయని వివరించారు. కాంతార సినిమా అన్ని భాషల్లో బ్లాక్‌బాస్టర్ విజయాన్ని అందుకుంది కాబట్టి ఈ చిత్రాన్ని విదేశీ భాషల్లోకి డబ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
ప్రత్యేకంగా కాంతార విజయం గురించి మాట్లాడుతూ.. ‘‘మన భారతీయులందరికీ కొన్ని వ్యవస్థలపై నమ్మకం ఉంటుంది. అందుకే ప్రజలు ఈ సినిమాకు మరింత కనెక్ట్ అయ్యారు. కానీ ఏ చిత్రానికైనా క్లైమాక్స్ చాలా ముఖ్యం. కాంతార 30 నిమిషాల క్లైమాక్స్‌లో వచ్చే శబ్దం ప్రేక్షకుల హృదయాల్లో ప్రతిధ్వనించింది. అందుకే సినీప్రియులు ఈ సినిమాను అంతగా ఆదరిస్తున్నారు’’ అని అన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Rahul Gandhi: ‘వాజ్‌పేయీ మాటలను గుర్తుతెచ్చుకోండి’.. అనర్హత వేటుపై ప్రశాంత్ కిశోర్!
-
General News
Tirumala: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుత కలకలం
-
Movies News
keerthy suresh: ‘దసరా’ కోసం ఐదురోజులు డబ్బింగ్ చెప్పా: కీర్తిసురేశ్
-
Crime News
ఘోరం: హోంవర్క్ చేయలేదని చితకబాదిన టీచర్.. ఏడేళ్ల బాలుడి మృతి
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
World Boxing Championship: ప్రపంచ మహిళ బాక్సింగ్ ఛాంపియన్షిప్.. భారత్‌కు మరో స్వర్ణం