Kapil Sharma: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. కపిల్ శర్మ సంచలన వ్యాఖ్యలు
తన జీవితంలో ఎదురైన క్లిష్ట పరిస్థితుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటుడు కపిల్ శర్మ (Kapil Sharma). ఒకానొక సమయంలో తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు వెల్లడించారు.
ముంబయి: ఐదేళ్ల క్రితం తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు బాలీవుడ్ నటుడు, వ్యాఖ్యాత, ‘ది కపిల్‌శర్మ షో’ ఫేమ్ కపిల్‌శర్మ (Kapil Sharma) తెలిపాడు. ఆ సమయంలో తాను మానసిక సంఘర్షణకు లోనయ్యానని దానిని ఎలా జయించాలో అర్థం కాక.. చచ్చిపోవాలనుకున్నానని వెల్లడించాడు. కావాల్సినంత డబ్బు, ఫేమ్, చుట్టూ ఎంతోమంది స్నేహితులు ఉన్నప్పటికీ తాను ఒంటరితనాన్ని అనుభవించానంటూ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశాడు.
‘‘2017లో నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. ఫీలింగ్స్‌ని పంచుకోవడానికి నా పక్కన ఎవరూ లేరనిపించింది. అయితే, ఇది నాకు కొత్తేమీ కాదు. మానసిక ఒత్తిడిపై పెద్దగా అవగాహన లేని చోటు నుంచి నేను వచ్చాను. చిన్నతనంలోనే ఎన్నో సందర్భాల్లో మానసిక క్షోభకు గురయ్యాను. ఆ సమయంలో నా బాధను ఎవరూ గుర్తించలేదు. డబ్బు సంపాదించడం కోసం కుటుంబాన్ని వదిలి ఒంటరిగా బయట ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు.. యోగక్షేమాలు చూసుకోవడానికి ఎవరూ లేనప్పుడు.. చుట్టూ ఉన్న పరిస్థితులు, ఎదుటి వ్యక్తుల ఉద్దేశాలు అర్థంకాక ఒంటరిగా అయిపోయినట్టు ఉంటుంది. నటీనటులకు ఇలాంటి ఇబ్బందులు మరింత ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాత.. చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవడం తెలుసుకున్నాను. ఒక నటుడు అమాయకంగా ఉన్నాడంటే దాని అర్థం అతడు తెలివితక్కువ వాడని అర్థం కాదు. అయితే జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న తర్వాత బాధ, సంతోషం ఏదైనా కొంతవరకే ఉంటాయని అర్థమైంది’’ అని కపిల్ శర్మ (Kapil Sharma) వివరించాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
rangamarthanda review: రివ్యూ: రంగ మార్తాండ
-
Sports News
Sachin - Sehwag: ముల్తాన్ టెస్టులో సిక్స్ కొడతానంటే.. సచిన్ అలా అనేశాడు: సెహ్వాగ్
-
World News
Medvedev: క్షిపణి రావొచ్చు.. ఆకాశాన్ని గమనిస్తూ ఉండండి: ఐసీసీకి మెద్వదేవ్ వార్నింగ్
-
Movies News
Brahmanandam: చనిపోయే వరకూ కమెడియన్‌గానే ఉంటా: బ్రహ్మానందం
-
General News
TSPSC: పేపర్ లీకేజీ కేసు స్టేటస్ రిపోర్టు ఇవ్వండి: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
-
General News
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5వేల అప్రెంటిస్ ఖాళీలు.. స్టైఫండ్ ఎంతంటే?