Karan Johar: ‘కేజీయఫ్‌-2’ మేము తీసుంటే చంపేసేవాళ్లు: కరణ్‌ జోహార్‌

‘కేజీయఫ్-2‌’ చిత్రాన్ని కనుక బాలీవుడ్‌లో తెరకెక్కించి ఉండుంటే అందరూ మాటల్తోనే చంపేసేవాళ్లని ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ అన్నారు. బాలీవుడ్‌లో విడుదలకు సిద్ధంగా ఉన్న ‘జుగ్‌ జుగ్‌ జియో’, ‘బ్రహ్మాస్త్ర’తోపాటు.....

Updated : 18 Jun 2022 16:19 IST

ముంబయి: ‘కేజీయఫ్-2‌’ చిత్రాన్ని కనుక బాలీవుడ్‌లో తెరకెక్కించి ఉంటే అందరూ మాటల్తోనే చంపేసేవాళ్లని ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ అన్నారు. బాలీవుడ్‌లో విడుదలకు సిద్ధంగా ఉన్న ‘జుగ్‌ జుగ్‌ జియో’, ‘బ్రహ్మాస్త్ర’తోపాటు ‘లైగర్‌’కూ ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఆయా సినిమాల ప్రమోషన్స్‌లో బిజీగా పాల్గొంటున్నారు. కాగా, తాజాగా కరణ్‌ ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆయన బాలీవుడ్‌ నుంచి వస్తోన్న కంటెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌ నుంచి ఈ మధ్యకాలంలో సరైన కంటెంట్‌ రాలేదని అన్నారు.

‘‘కథలను ఎంచుకోవడం, తెరకెక్కించే విషయంలో దక్షిణాది చిత్ర దర్శకులకు ఉన్న నమ్మకం.. ఈ మధ్యకాలంలో బాలీవుడ్‌లో లోపించినట్లు అనిపిస్తోంది. ఒకే సినిమాలో ఎన్నో అంశాలను చూపించాలనుకుని.. కొన్నిసార్లు మేము విఫలమవుతుంటాం. కానీ, దక్షిణాది దర్శకులు.. ఏం చెప్పాలనుకుంటే దాన్ని సరిగ్గా, ప్రేక్షకుడికి చేరువయ్యేలా సినిమాలు రూపొందిస్తున్నారు. ఇటీవల నేను ‘కేజీయఫ్‌-2’ చూశా. మనస్ఫూర్తిగా చెబుతున్నా ఆ సినిమా నాకెంతో నచ్చింది. ఆ సినిమానే బాలీవుడ్‌లో తీసుంటే.. మాకెన్నో విమర్శలు ఎదురయ్యేవి. విమర్శలతో అందరూ మమ్మల్ని చంపేసేవాళ్లు’’ అని కరణ్‌ జోహార్‌ అన్నారు.

ప్రశాంత్‌నీల్‌-యశ్‌ కాంబినేషన్‌లో ‘కేజీయఫ్‌’కు సీక్వెల్‌గా వచ్చిన చిత్రం ‘కేజీయఫ్‌-2’. సంజయ్‌ దత్‌, రవీనా టాండన్‌, ప్రకాశ్‌రాజ్‌, ఈశ్వరీ రావు కీలకపాత్రలు పోషించారు. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈసినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టింది. విడుదలైన కొన్నిరోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1100 కోట్లు వసూళ్లు రాబట్టింది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts