Janhvi Sara: ఆ అన్నదమ్ములతో జాన్వి, సారా డేటింగ్‌.. ఆసక్తికర విషయాన్ని బయటపెట్టిన కరణ్‌

బీటౌన్‌ యువ నటీమణులు, బెస్ట్‌ ఫ్రెండ్స్‌ సారా అలీఖాన్ (Sara Ali Khan)‌, జాన్వికపూర్‌(Janhvi Kapoor) వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని బాలీవుడ్‌ దర్శకుడు, నిర్మాత కరణ్‌ జోహార్‌....

Published : 16 Jul 2022 01:54 IST

ముంబయి: బీటౌన్‌ కథానాయికలు, బెస్ట్‌ ఫ్రెండ్స్‌ సారా అలీఖాన్ (Sara Ali Khan)‌, జాన్వికపూర్‌(Janhvi Kapoor) వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని బాలీవుడ్‌ దర్శకుడు, నిర్మాత కరణ్‌ జోహార్‌ (Karan Johar) బయటపెట్టారు. జాన్వి, సారా ఒకానొక సమయంలో ఇద్దరు వ్యక్తులతో డేటింగ్‌లో ఉన్నారని, వాళ్లిద్దరూ అన్నదమ్ములని ఆయన చెప్పారు. ఆ అబ్బాయిలు తన బిల్డింగ్‌లోనే నివాసం ఉండేవారంటూ కరణ్‌ చెప్పడంతో సారా, జాన్వి ఒకింత షాక్‌కు గురయ్యారు. కరణ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు అంతటా వైరల్‌గా మారాయి.

కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ చాట్‌ షో ‘కాఫీ విత్‌ కరణ్‌’ (Koffee With Karan). తాజాగా ఈ కార్యక్రమంలో సారా అలీఖాన్‌, జాన్వికపూర్‌ పాల్గొని తమ ఫ్రెండ్‌షిప్‌పై ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా కరణ్‌ స్పందిస్తూ.. ‘‘మీ ఇద్దరి స్నేహం ఏ స్థాయిలో ఉందో నాకు తెలియదు కానీ, గతంలో మీరు అన్నదమ్ములైన ఇద్దరు వ్యక్తులతో డేటింగ్‌లో ఉన్నారు కదా. అది నాకు గుర్తుంది’’ అని కరణ్‌ చెప్పగానే సారా, జాన్వి షాక్‌ అయ్యారు. వెంటనే కరణ్‌ స్పందిస్తూ.. ‘‘ఆ ఇద్దరూ మా బిల్డింగ్‌లోనే ఉండేవాళ్లు’’ అంటూ ఆ టాపిక్‌ని అంతటితో క్లోజ్‌ చేశారు. ఇది చూసిన నెటిజన్లు ఆ అన్నదమ్ములెవరా? అని సెర్చ్‌ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, జాన్వి, సారా గతంలో ఓ ప్రముఖ రాజకీయ నేత మనవళ్లైన వీర్‌ పహారియా(vir pahariya), శిఖర్‌ పహారియా(shikhar pahariya)తో డేట్‌లో ఉన్నారు. ఈ జంటలు తరచూ పార్టీలు, ఫంక్షన్స్‌లో దర్శనమిస్తుండేవారు. ఆ సమయంలో వీళ్ల ఫొటోలు సైతం నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. వీర్‌తో తనకు బ్రేకప్‌ అయ్యిందని గతంలో సారా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని