Karan Johar: తాప్సీ అలా చెబితే నేను బాధపడతా: కరణ్‌ జోహార్‌

‘కాఫీ విత్‌ కరణ్‌’ షోకు ఇప్పటివరకూ తాప్సీని ఆహ్వానించకపోవడంపై కరణ్‌ స్పందించారు. 

Updated : 30 Sep 2022 11:11 IST

ముంబయి‌: సెలబ్రిటీ చాట్‌ షో ‘కాఫీ విత్‌ కరణ్‌’ (Koffee With Karan) సీజన్‌ - 7 ముగిసింది. 12 వారాలపాటు ప్రేక్షకుల్ని అలరించిన ఈ షోలో ఆలియా భట్‌ - రణ్‌వీర్‌ సింగ్‌, జాన్వికపూర్‌ - సారా అలీఖాన్‌, అక్షయ్‌కుమార్‌ - సమంత, విజయ్‌ దేవరకొండ - అనన్యా పాండే, అమిర్‌ఖాన్‌ - కరీనాకపూర్‌, విక్కీకౌశల్‌ - సిద్ధార్థ్‌ మల్హోత్ర.. ఇలా పలు జంటలు పాల్గొని సందడి చేశాయి. తాజాగా ప్రసారమైన 13వ ఎపిసోడ్‌లో ఈ షోకు జ్యురీ సభ్యులుగా వ్యవహరిస్తోన్న సోషల్‌మీడియా సెలబ్రిటీలు పాల్గొని.. కరణ్‌ను పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగారు.

‘‘గడిచిన రెండేళ్లలో కెరీర్‌పరంగా మంచి విజయాలు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటీనటులను ఇంకా ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోకు ఆహ్వానించలేదు. అలా పిలవనివారిలో తాప్సీ ఒకరు. ఎందుకలా?’’ అని ప్రశ్నించగా.. ‘‘మీకు బాగా తెలుసు ఇది 12 ఎపిసోడ్ల సీజన్‌. ప్రేక్షకుల్ని అలరించేవిధంగా ఉండే సెలబ్రిటీ జోడీలను టీమ్‌ ఎంపిక చేసింది. తాప్సీకి సెట్‌ అయ్యేలా జోడీ దొరికితే.. ఆమెను నేనే ఆహ్వానిస్తాను. అప్పుడామె ఒప్పుకోకపోతే బాధపడతాను’’ అని కరణ్‌ తెలిపారు.

గతంలో ఓ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న తాప్సీ.. ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో పాల్గొనకపోవడంపై స్పందించింది. ‘ఆ షోలో పాల్గొనేంత ఆసక్తికరంగా నా శృంగార జీవితం లేదు’ అని వ్యంగ్యాస్త్రాలు విసిరింది. అయితే, ఈ షోలో పాల్గొన్న సెలబ్రిటీలందర్నీ కరణ్‌ జోహార్‌ ఎక్కువగా శృంగార జీవితం, బాయ్‌ఫ్రెండ్స్‌, గర్ల్‌ఫ్రెండ్స్‌.. ఇలా వీటి గురించే ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని