Alia Ranbir: ఆలియా, రణ్‌బీర్‌లను రిజక్ట్‌ చేసిన అయాన్‌..!

బాలీవుడ్‌ జంట ఆలియాభట్‌, రణ్‌బీర్‌ కపూర్‌లను తమ గ్రూప్‌లోకి తీసుకోవడానికి దర్శకుడు అయాన్‌ ముఖర్జీ అంగీకరించలేదని కరణ్‌ జోహార్‌ తెలిపారు.

Published : 22 Apr 2022 13:23 IST

కరణ్‌జోహార్‌ ఏం చెప్పారంటే

ముంబయి: బాలీవుడ్‌ జంట ఆలియాభట్‌, రణ్‌బీర్‌ కపూర్‌లను తమ గ్రూప్‌లోకి తీసుకోవడానికి దర్శకుడు అయాన్‌ ముఖర్జీ అంగీకరించలేదని కరణ్‌ జోహార్‌ తెలిపారు. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరణ్‌ కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. సోషల్‌మీడియాలో విభిన్న మనస్తత్వాలు ఉన్నవాళ్లు ఉంటారని.. కొంతమంది నుంచి ప్రశంసలు, ప్రేమాభిమానాలు, మరికొంతమంది నుంచి ప్రతికూల స్పందనలు వస్తుంటాయని అన్నారు. సోషల్‌మీడియాలో అడుగుపెట్టిన సమయంలో తాను ఎంతో నెగెటివిటీని ఎదుర్కొన్నానని.. కానీ ఇప్పుడు వాటిని పట్టించుకోవడం లేదని కరణ్‌ తెలిపారు.

అనంతరం తన వాట్సాప్‌ గ్రూప్స్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘మాకు ప్రత్యేకంగా ‘ఏ లిస్టర్స్‌’ అనే వాట్సాప్‌ గ్రూప్‌ ఉంది. దర్శకుడు అయాన్‌ ముఖర్జీ, ప్రొడెక్షన్‌ డిజైనర్‌ అమృతా.. ఇలా ఆ గ్రూప్‌లో అందరూ ‘A’తో ప్రారంభమయ్యే వారే ఉంటారు. ఇందులో మేము ఎక్కువగా సినిమా ట్రైలర్స్‌, టీజర్స్‌ గురించి విశ్లేషణ చేస్తుంటాం. ‘2 స్టేట్స్‌’ డైరెక్టర్‌ అభిషేక్‌ వర్మ.. విడుదలైన ప్రతి సినిమా ట్రైలర్‌ని ఈ గ్రూప్‌ పెడతాడు. మిగిలిన సభ్యులందరం ఆ ట్రైలర్‌, వివిధ డిపార్ట్‌మెంట్స్‌ వర్క్‌ గురించి ఎక్కువగా చర్చించుకుంటాం. అయితే, ఈ గ్రూప్‌లో భాగం కావడానికి ఆలియాభట్‌, రణ్‌బీర్‌ కపూర్‌ ఎంతో ప్రయత్నించారు. వాళ్లిద్దర్నీ ఇందులో భాగం చేయాలని నేను అనుకున్నప్పటికీ అయాన్‌ దానికి అంగీకరించలేదు. ఈ గ్రూప్‌లో నటీనటులెవ్వరూ ఉండకూడదని అతను ఓ రూల్‌ పెట్టాడు’’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని