Alia Bhatt: ‘చాందినీ’లో శ్రీదేవి స్టైల్లో అలియా భట్‌

భారతీయ చిత్రసీమను ఏలిన కథానాయిక దివంగత శ్రీదేవి (Sri Devi) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘చాందినీ’. యశ్‌ చోప్రా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ బ్లాక్‌బస్టర్‌ సినిమాలో శ్రీదేవి టైటిల్‌ పాత్రలో మధ్యతరగతి అమ్మాయిగా నటించి అందర్నీ అలరించారు.

Updated : 02 Mar 2023 07:15 IST

భారతీయ చిత్రసీమను ఏలిన కథానాయిక దివంగత శ్రీదేవి (Sri Devi) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘చాందినీ’. యశ్‌ చోప్రా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ బ్లాక్‌బస్టర్‌ సినిమాలో శ్రీదేవి టైటిల్‌ పాత్రలో మధ్యతరగతి అమ్మాయిగా నటించి అందర్నీ అలరించారు. ఇందులోని ఆమె ఆహార్యం ఎప్పటికీ గుర్తే. ఇప్పుడు ఆ స్టైల్‌లో శ్రీదేవి తరహాలో కనిపించబోతుంది యువ కథానాయిక అలియా భట్‌ (Alia Bhatt).  వెండితెరపై కరణ్‌ జోహార్‌ (Karan Johar) తెరకెక్కించనున్న ‘రాఖీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’ (Rocky Aur Rani Ki Prem Kahani) సినిమా చివరి షెడ్యూల్‌లో భాగంగా ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ  పాట గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు కరణ్‌. ‘నాకు ఇష్టమైన చిత్రనిర్మాతకి అంకితం చేసే పాటను చిత్రీకరిస్తున్నాను .. ఇంకేమీ చెప్పను’ అని చెప్పారు. ఈ ప్రత్యేకమైన పాటలో ‘చాందినీ’లోని శ్రీదేవి ఐకానిక్‌ స్టైల్‌లో అలియా కనిపించబోతుంది. దీని కోసం మనీషా మల్హోత్రా చీరను డిజైన్‌ చేశారు. ఈ సినిమాలో రణ్‌వీర్‌ సింగ్‌, ధర్మేంద్ర, జయ బచ్చన్‌ కీలక పాత్రల్లో నటించారు. జులై 28న ఈ సినిమా విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని