అదే నేను తీసుకున్న ఉత్తమ నిర్ణయం

‘ఆ చిత్రంలో నటించడం.. నేను తీసుకున్న ఉత్తమ నిర్ణయం’ అని అంటోంది బాలీవుడ్‌ భామ కరీనాకపూర్‌. 2018లో ఆమె నటించిన ‘వీరే ది వెడ్డింగ్‌’ విడుదలై మూడేళ్లు గడిచాయి. ఈ సందర్భంగా ఆ చిత్రాన్ని గుర్తుచేసుకుంటూ

Published : 02 Jun 2021 22:18 IST

బాలీవుడ్‌ భామ కరీనాకపూర్‌

ముంబయి:  ‘ఆ చిత్రంలో నటించడం.. నేను తీసుకున్న ఉత్తమ నిర్ణయం’ అని అంటోంది బాలీవుడ్‌ భామ కరీనాకపూర్‌. 2018లో ఆమె నటించిన ‘వీరే ది వెడ్డింగ్‌’ విడుదలై మూడేళ్లు గడిచాయి. ఈ సందర్భంగా ఆ చిత్రాన్ని గుర్తుచేసుకుంటూ తాను తీసుకున్న నిర్ణయాల్లో మంచిదని చెప్పింది. హీరోయిన్‌ సోనమ్‌కపూర్‌ సోదరి రియాకపూర్‌ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రంలో కరీనాతో పాటు సోనమ్కపూర్‌, స్వరా భాస్కర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సందర్భంగా రియా ఆ చిత్రపోస్టర్‌ని ఇన్‌స్టా వేదికగా పోస్టు చేయగా.. దాన్నే స్టోరీగా పెట్టి తన అనుభవాలను రాసుకొచ్చింది కరీనా. కాగా ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతున్న వేళ ఆమె గర్భవతి. ప్రెగ్నెన్సీ కారణంగా కథలో ఆరునెలల గర్భవతి పాత్రను పోషించేలా మార్పు చేశారు ఆ చిత్ర దర్శకుడు శశాంక్‌గోషా, సహనిర్మాత రియాకపూర్‌. అనంతరం కొత్త స్క్రిప్ట్‌ సిద్ధం చేశాక, ప్రసూతి సెలవులయ్యాక వచ్చి షూటింగ్‌లో పాల్గొన్నారామె. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండో మగబిడ్డకు జన్మనిచ్చారు 40 ఏళ్ల కరీనా. ప్రస్తుతం అమిర్‌ఖాన్‌ హీరోగా నటిస్తున్న ‘లాల్‌సింగ్‌ చద్దా’లో మనీలా సోది అనే పాత్రను పోషిస్తోందామె. ఈ ఏడాది డిసెంబర్‌24న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని