Kareena Kapoor: సినిమా లేకపోతే మీకు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎలా? బాయ్‌కాట్‌ ట్రెండ్‌పై కరీనా

గత కొంతకాలంగా బాలీవుడ్‌ను ‘బాయ్‌కాట్‌’ ట్రెండ్‌ కుదిపిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ట్రెండ్‌పై పెదవి విప్పారు నటి కరీనా కపూర్‌ (Kareena Kapoor).

Updated : 23 Jan 2023 15:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘బాయ్‌కాట్ బాలీవుడ్‌’ (Boycott Bollywood) ట్రెండ్‌పై బీటౌన్‌ నటి కరీనా కపూర్‌ (Kareena Kapoor) స్పందించారు.  సినిమాల్లేకపోతే ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్కడి నుంచి లభిస్తుంది? అని ఆమె ప్రశ్నించారు. కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ఈ బాయ్‌కాట్‌ ట్రెండ్‌ను నేను ఏమాత్రం అంగీకరించను. ఒకవేళ సినిమాలనే నిషేధిస్తే.. మేము మిమ్మల్ని ఎలా ఎంటర్‌టైన్ చేస్తాం? మీ జీవితంలో సంతోషం ఎలా ఉంటుంది?. కాబట్టి, సినిమా అనేది ప్రతి ఒక్కరికీ అవసరం ’’ అని అన్నారు.

రెండేళ్ల నుంచి ఈ అంశం బాలీవుడ్‌(Bollywood)ను కుదిపేస్తోంది. యువ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘బాయ్‌కాట్‌ బాలీవుడ్‌’ అని పేర్కొంటూ సోషల్‌మీడియా వేదికగా 2020 నుంచి అగ్ర తారలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. క్రమక్రమంగా అది మరింత ఎక్కువైంది. మొదట్లో నటీనటులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన నెటిజన్లు.. ఇటీవల కాలంలో స్టార్‌ హీరో హీరోయిన్ల సినిమాలు విడుదలయ్యే సమయంలో ఆయా చిత్రాలను నిషేధించాలంటూ ట్రెండింగ్‌లు సృష్టిస్తోన్నారు.

కరీనాకపూర్‌ - ఆమిర్‌ఖాన్‌ నటించిన ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ (Laal Singh Chaddha) సైతం బాయ్‌కాట్‌ సెగను ఎదుర్కొంది. ఇప్పుడు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న ‘పఠాన్‌’ (Pathaan)కూ ఈ ఎదురుదెబ్బ తగిలింది. ఈ ట్రెండ్‌ వల్ల పరిశ్రమకు ఎంతో నష్టం వాటిల్లుతోందని, సినిమాలపై ఈ విధమైన ద్వేషాన్ని చూపించడం సరైన పద్ధతి కాదని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు సినీ ప్రముఖులు ఇటీవల యూపీ సీఎంను కలిశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు