Kareena Kapoor: ‘నాటు నాటు’ పెడితేనే అన్నం తింటాడు

రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇందులోని ‘నాటు నాటు’ (Naatu Naatu) పాట ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్‌ అవార్డును కైవసం చేసుకొని సంబరాలు జరుపుకుంటోంది.

Updated : 19 Mar 2023 07:09 IST

రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇందులోని ‘నాటు నాటు’ (Naatu Naatu) పాట ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్‌ అవార్డును కైవసం చేసుకొని సంబరాలు జరుపుకుంటోంది. హుషారైన స్టెప్పులతో సాగే ఈ పాట సామాన్యుల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరితో డ్యాన్స్‌ చేయిస్తోంది. ఇంతలా క్రేజ్‌ సంపాదించుకున్నా ఈ పాట తన రెండేళ్ల కుమారుడి మనసును కూడా దోచుకుందంటూ బాలీవుడ్‌ కథానాయిక కరీనా కపూర్‌ (Kareena Kapoor) ఒక ఇంటర్వూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘మా చిన్న అబ్బాయి జెహ్‌ నాటు నాటు పాట పెడితేనే అన్నం తింటాడు. ఈ పాటను  తెలుగులోనే వినడానికి ఇష్టపడతాడు’ అని చెప్పింది. ‘95వ అకాడమీ అవార్డ్స్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ఆస్కార్‌ను గెలవటంతో దేశం మొత్తం ఆనందంతో నిండిపోయింది. ఇందులో నేను సభ్యురాలైనందుకు సంతోషిస్తున్నాను. భారతీయ సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా చూడటం పట్ల గర్వంగా భావిస్తున్నాన’ని చెప్పింది. ప్రస్తుతం ఆఫ్రికాలో తన కుటుంబంతో గడుపుతోంది కరీనా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు