Published : 10 Aug 2022 01:27 IST

kareena kapoor: ప్రస్తుతం ఆమె కన్నా పెద్ద స్టార్‌ ఎవరూ లేరు: కరీనా

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ప్రస్తుతం ‘అలియాభట్’ (Alia Bhatt) కన్నా పెద్ద స్టార్‌ ఎవరు లేరు’ అని ప్రశంసించారు బాలీవుడ్‌ సీనియర్‌ నటి కరీనా కపూర్(Kareena Kapoor)‌. అలియా తాజా చిత్రం ‘డార్లింగ్స్‌’(Darlings) గురించి కరీనాను ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా ‘ప్రస్తుతం అలియాను చూస్తుంటే గర్వంగా ఉంది. వివాహం విషయంలోనూ, గర్భధారణ విషయంలోనూ తనపై వస్తున్న పుకార్లను చిరునవ్వుతో ఎదుర్కొంటూ కెరీర్‌లో ఉన్నతమైన దిశగా ప్రయాణిస్తున్న  అలియాను చూస్తుంటే ఆమె కన్నా పెద్ద స్టార్‌ లేరనిపిస్తుంది. ప్రస్తుతం నా దృష్టిలో ఆమె ఒక ఉన్నతమైన వ్యక్తి’ అంటూ అలియాను పొగడ్తలతో ముంచెత్తింది. 

గతంలో చాలా సందర్భాల్లో అలియా భట్‌ కూడా తన అభిమాన నటి ‘కరీనా కపూర్‌’ అని వెల్లడించింది. కథానాయిక ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తూ, రణ్‌బీర్‌తో వివాహ జీవితాన్ని ఆస్వాదిస్తూ, ప్రెగ్నెంట్‌గా ఉండి ‘డార్లింగ్స్’ ప్రచారంలో పాల్గొంటుంది అలియాభట్‌. ఈ విషయంలో బాలీవుడ్‌ మీడియా సైతం అలియాను ప్రశంసిస్తోంది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని