Multi Starrer: తెరపై సందడి చేయడానికి సిద్ధమైన స్టార్‌ బ్రదర్స్‌..

హీరో సూర్య (Suriya), కార్తిలు కలిసి ఓ సినిమా చేయనున్నారు. ఈ విషయాన్ని కార్తి వెల్లడించారు.

Published : 18 Sep 2023 12:53 IST

హైదరాబాద్‌: సహజంగానే మల్టీ స్టారర్ సినిమా వస్తోందంటే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది. అలాటింది స్టార్‌ సోదరులు ఒకే సినిమాలో కనిపించనున్నారంటే వారి అభిమానులకు పండగే. కోలీవుడ్‌ స్టార్‌ హీరోలు సూర్య, కార్తిలు (Karthi) వారి నటనతో తెలుగులోనూ అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి ఓ భారీ ప్రాజెక్ట్‌లో నటించనున్నారు. ఈ విషయాన్ని కార్తి స్వయంగా వెల్లడించారు.

ఈ ఇద్దరి సినిమా రానుందని గతేడాది నుంచి ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న కార్తిని ఈ విషయంపై ప్రశ్నించగా.. ఆయన అవునంటూ ఖరారు చేశారు. ‘‘అన్నదమ్ములిద్దరూ ఒకే ఇండస్ట్రీలో ఉండడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. మేమిద్దరం కలిసి ఓ సినిమా చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ఈ విషయంలో మొదట్లో భయపడ్డాను. కానీ, ఇప్పుడు మాత్రం కచ్చితంగా అన్నయ్యతో (Suriya) సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. నాకు సవాళ్లు అంటే ఇష్టం. సినిమాలు నాకు ఆ అవకాశాన్ని కల్పించాయి. ప్రతి చిత్రంలోనూ సవాలుతో కూడిన పాత్రల్లో నటించే అవకాశం నాకు దక్కింది. ఇక నేను నటుడిగా మారడం యాదృచ్ఛికంగా జరిగింది. నాకు మొదటి నుంచి దర్శకుడు కావాలనే కోరిక ఉండేది. ‘నువ్వు 60 ఏళ్ల వయసులోనూ దర్శకుడివి కావచ్చు. కానీ, నటనకు ఒక వయసు ఉంటుంది’ అని  మా నాన్న అనడంతో అనుకోకుండా నటుడిని అయ్యాను’’ అని కార్తి చెప్పారు.

వినాయక చవితికి వినోదాన్ని పంచిన కొత్త పోస్టర్లు..

ఇక తాను నటించిన ‘ఖైదీ’ (Kaithi) సినిమాకు కూడా సీక్వెల్ రానున్నట్లు కార్తి తెలిపారు. ఈ చిత్రం 2019లో తెలుగులో విడుదలై ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు దీని సీక్వెల్‌ పనులు మొదలు పెట్టామని కార్తి చెప్పడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీక్వెల్‌లోనే అన్నదమ్ములు కనిపించనున్నారనే  వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే తన తర్వాత సినిమాలో అరవిందస్వామి ఉన్నట్లు కార్తి వెల్లడించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని