Karthi: హీరో కార్తి ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హ్యాక్‌..

సెలబ్రెటీల సోషల్‌ మీడియా ఖాతాలు హ్యాక్‌ అవ్వడం తరచుగా వింటుంటాం. తాజాగా హీరో కార్తి ఫేస్‌బుక్‌ పేజీ హ్యాక్‌ అయింది. ఈ విషయాన్ని అతడే ట్విటర్‌ వేదికగా తెలిపారు. 

Published : 14 Nov 2022 13:08 IST

హైదరాబాద్‌: భాషతో సంబంధం లేకుండా అభిమానులను సంపాదించుకున్నాడు కార్తి (karthi). వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటుంటాడు. తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్‌లైనా.. తన వ్యక్తిగత విషయాలైనా సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంటాడు ఈ యంగ్‌ హీరో. తరచూ నెట్టింట యాక్టివ్‌గా ఉండే కార్తి ఫేస్‌బుక్‌ పేజీ హ్యాక్‌ అయిందిట. ఈ విషయాన్ని అతడే ట్విటర్‌ వేదికగా తెలియజేశాడు. ‘‘నా ఫేస్‌బుక్‌ పేజీ హ్యాక్‌ అయింది. ప్రస్తుతం ఫేస్‌బుక్‌ టెక్నికల్‌ టీంతో కలిసి పనిచేస్తున్నాం. త్వరలోనే అకౌంట్‌ను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తాం’’ అని ట్వీట్‌ చేశాడు.

ఇక ఈ ఏడాది కార్తి వరస విజయాలతో దూసుకెళ్తున్నాడు. పొన్నియిన్‌ సెల్వన్‌ సినిమాతో అలరించిన ఈ హీరో సర్దార్‌తో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇందులో కార్తి నటనకు సినీ విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ హీరో రాజు మురుగన్‌ దర్శకత్వంలో జపాన్‌ (Japan) సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అతడి సరసన అను ఇమ్మాన్యుయేల్‌ అలరించనుంది.  డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు నిర్మిస్తున్నారు. సునీల్‌ ఓ కీలకపాత్రలో కనిపించనున్నాడు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని